Summer Simple Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వేసవిలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా మందిలో డీహైడ్రేటెషన్ సమస్యలు వస్తాయి. దీని కారణంగా బరువు తగ్గడానికి అనేక ఆటంకాలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్ ఉంచుకోండి:
ఎండాకాలం బరువు తగ్గడం చాలా కష్టం..అంతేకాకుండా ఎంతో శ్రమతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ముందు చేయాల్సింది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం. ఎందుకంటే చాలా మందిలో బరువు తగ్గే క్రమంలో డీహైడ్రేటెషన్ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య బారిన పడకుండా ఉండడానికి నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామం తప్పనిసరి :
వేసవి కాలంలో తప్పకుండా వారికి మూడు నుంచి నాలుగు సార్లు వ్యాయామాలు చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిజీ లేని వారు ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
షుగర్ డ్రింక్స్ తాగొద్దు:
ఎండా కాలం వచ్చిందంటే చాలు చాలా మంది అతిగా శీతలపానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు.
రాత్రి అతిగా తినొద్దు:
సమ్మర్లో రాత్రి పూట అతిగా తినే అలవాటు ఉన్నవారు అంత సులభంగా బరువు తగ్గలేరు. కాబట్టి రాత్రి పూట కేవలం పోషకాలు కలిగిన ఆహారాలు మాత్రమే చిన్న ప్లేట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు నియత్రణలో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
ఫైబర్, విటమిన్ల ఆహారాలు తీసుకోండి:
ప్రతి రోజు సమ్మర్లో బరువు తగ్గాలనుకునేవారు ఫైబర్, విటమిన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని డైట్ పద్ధతిలో తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter