Mohammed Shami: మహ్మద్ షమీ సర్జరీ సక్సెస్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్..

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 10:54 PM IST
Mohammed Shami: మహ్మద్ షమీ సర్జరీ సక్సెస్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్..

Mohammed Shami Surgery Success: గాయంతో ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరమయ్యాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ. తాజాగా అతడు యూకే వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. తన శస్త్రచికిత్స విజయవంతం అయిందని మహ్మద్ షమీ వెల్లడించాడు. అంతేకాకుండా తాను బెడ్ పై ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. షమీ గాయం నుంచి కోలుకుంటాడనే నమ్మకం నాకు ఉందని.. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‍కు మహమ్మద్ షమీ బదులిచ్చాడు. 'నా ఆరోగ్యం గురించి మోదీ ట్వీట్ చేయడం చాలా సర్‌ప్రైజ్‍గా ఉందని.. ఇలాంటి సమయంలో నాకు విషెస్, మద్దతు తెలిపిన మోదీ సర్‌కు ధన్యవాదాలు. నేను కోలుకునేందుకు పూర్తిస్థాయిలో నిరంతరం కృషి చేస్తా' అని షమీ అన్నాడు. 

ఐపీఎల్‍, టీ20 ప్రపంచకప్ కు దూరం!
సర్జరీ తర్వాత మహ్మద్ షమీ మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే గుజరాత్ టైటాన్స్ పెద్ద దెబ్బనే చెప్పాలి. 2022లో గుజరాత్ టైటిల్ గెలవడంలో, గతేడాది ఫైనల్ వరకు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు షమీ కూడా లేకపోవడం ఆ జట్టుకు కోలుకులేని దెబ్బ. జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి కూడా షమీ అందుబాటులో ఉంటాడా లేదనది సందిగ్ధంగా మారింది. 

Also Read: Ind vs Eng: కోహ్లీ, షమీ, రాహుల్ స్టార్ ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ సిరీస్ నెగ్గిన టీమ్ ఇండియా

Also Read: T20I Cricket: టీ20ల్లో నమీబియా బ్యాటర్ సంచలనం.. కేవలం 33 బంతుల్లోనే సెంచ‌రీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News