Holi 2024: మార్చ్ నెల వచ్చేసింది. దేశమంతా ఎదురుచూసే హోలీ వస్తోంది. ఫల్గుణ మాసంలో చాలా పండుగలున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది హోలీ మార్చ్ 25వ తేదీన ఉంది. హోలీ అనగానే సాధారణంగా దేశంలోని మధుర-బృందావన్ గుర్తొస్తాయి. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో హోలీ అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
పంజాబ్ పంజాబ్లో హోలీని హోలా మొహల్లాగా నిర్వహిస్తారు. ఈ రోజున మగవారి పరాక్రమం, వీరత్వానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. రంగులతో హోలీ ఆడతారు. సాయంత్రం వేళ నృత్య కార్యక్రమాలుంటాయి.
మంజుల్ కులీ-ఉక్కులీ, కేరళ కేరళలో ఓనం ఎంత ప్రసిద్ధి చెందిందో హోలీ కూడా అంతే. హోలీ ఆనందం పొందాలంటే కేరళ వెళ్లాల్సిందే. కేరళలో హోలీని మంజుల్ కులీ-ఉక్కులీగా పిలుస్తారు.
హంపి, కర్ణాటక కర్ణాటకలోని హంపి గత చరిత్రకే కాకుండా హోలీకు చాలా ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు హోలీ పండుగ కోసం తుంగభద్ర, ఇతర ఉపనదుల్లో స్నానాలు చేస్తారు. కర్ణాటకలో హోలీ రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. నలుమూలల్నించి భారీగా జనం తరలివస్తారు.
గోవా గోవాలో హోలీని శిగ్మోగా అభివర్ణిస్తారు. హోలీని వసంతానికి ఆగమనంగా నిర్వహిస్తారు.
డోల్ యాత్ర-అస్సోం అస్సోంలో హోలీ పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. రెండ్రోజులపాటు ఈ ఉత్సవం నడుస్తుంది. హోలీని ఈ రాష్ట్రంలో డోల్ యాత్రగా పిలుస్తారు. మొదటి రోజు మట్టితో చేసిన గుడిసెను తగలబెట్టి హోలికా దనహం చేస్తారు. రెండోరోజు రంగులతో హోలీ జరుపుకుంటారు.