Japan Police High Alert On Cat Falls In Toxic Tank: కొన్నిసార్లు మన ఇంట్లో పెంచుకునే శునకాలు, పిల్లులు బావిలో, వాటర్ సంప్ లలో పడుతుంటాయి. వెంటనే గమనించి దాన్నుంచి మనం కాపాడుతుంటాం. ఇక ఎవరు గమనించకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణంగా ఫ్యాక్టరీలలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. పెయింటిగ్స్ లను తయారు చేసే కంపెనీలలో కూడా కొన్ని బావుల మాదిరిగా ఉంటాయి. దీనిలో కొన్నిప్రత్యేకమైన గీతలు ఉంటాయి. ఇవి దాటిలోపకి వైపుకు ఎవరిని అనుమంతించరు. ఐరన్ ఫ్యాక్టరీలు, కెమికల్స్ ఫ్యాక్టరీలలో రసాయనాలు ప్రత్యేకమైన బావుల, ట్యాంకుల మాదిరిగా ఉంటాయి. అనుకొని ఘటనల్లో కొన్నిసార్లు కార్మికులు వీటిలో పడిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఘటన జపాన్ లోని హిరోషిమాలో జరిగింది. కానీ ఇక్కడ ప్రమాదకర కెమికల్ ట్యాంకులో పడింది మనిషి కాదు.. ఒక పిల్లి. అంతే కాకుండా.. పిల్లి అందులో పడి తిరిగి పైకి వచ్చి తప్పించుకోని పోయింది. ఇక అధికారుల్లో గుబులు మొదలైంది.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
జపాన్ లోని పుకుయామా నగరంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న డెంజరస్ కెమికల్ ట్యాంకులో ఒక పిల్లిపడింది. ఆ తర్వాత మెల్లగా అదిపైకి వచ్చి లేచి వెళ్లిపొయింది. దాని పాద ముద్రలు అక్కడే ఉన్నాయి. సీసీ కెమెరాలో కూడా ఈ ఘటన రికర్డు అయ్యింది. అది అత్యంత ప్రమాదకర రసాయనాలతో కూడిన ట్యంక్. దానిలో నుంచి ప్రమాదకర కెమికల్స్ వెలువడతాయి. దాన్ని వాసన తీసుకుంటే క్యాన్సర్ సోకుతుంది.
పొరపాటున పిల్లిని ముట్టుకున్న కూడా క్యాన్సర్ సోకుతుందని అక్కడి వారు ఆందోళన చెందున్నారు. పుకుయామా నగరమంతాట హైఅలర్ట్ ప్రకటించారు. ఇంట్లో నుంచి ఎవరు బైటకు రావోద్దని ఆదేశాలు జారీచేశారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పడిన పిల్లి కోసం ఇప్పుడు అణువణువున గాలిస్తున్నారు.
Read More: Cockroaches: అమ్మబాబోయ్.. ఒక దోశలో 8 బొద్దింకలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
ఇక మరోవైపు పిల్లులకు సాధారణంగా తమ శరీరాన్ని నాక్కునే అలవాటు ఉంటుంది. దీన్ని బట్టి చూసిన కూడా అది తనకు తానే నాక్కుని చనిపోయి ఉండోచ్చని కూడా కొందరు వాదిస్తున్నారు. పిల్లి చనిపోయిన ఆనవాళ్లు అయిన దొరకాలి కదా.. అంటూ అధికారులు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం పుకుయామా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook