Delhi Woman Finds 8 Cockroaches In Dosa: మనలో చాలా మంది తరచుగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హోటల్స్ లేదా రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు అక్కడి హోటల్ పరిసరాలు ఛెండాలంగా ఉంటాయి. ఇక.. ఫుడ్ ప్రిపేర్ చేసే ప్రదేశం గురించి ఇక స్పెషల్ గా చెప్పనక్లర్లేదు. కొన్నిసార్లు ఆర్డర్ పెట్టిన ఫుడ్ లో పురుగులు వచ్చిన ఘటనలు వార్తలలో నిలిచాయి. బల్లులు, చనిపోయిన పురుగులు, బొద్దింకలు ఇలా ఆర్డర్ పెట్టిన పాపానికి, ప్లేట్లలో వచ్చి పడుతుంటాయి. కస్టమర్లు వీటిని చూసి ఇదేంటని దబాయిస్తే హోటల్ సిబ్బందులుదాడులు చేయడం, పట్టనట్లు సమాధానాలు చెప్తుంటారు. దీంతో గొడవలు జరిగిన సంఘటనలు కూడా అనేకం జరిగాయి. కొందరు ఇలాంటి ఫుడ్ తిని వామిటింగ్ చేసుకుని ఆస్పత్రిపాలు కూడా అవుతుంటారు. ఫుడ్ సెఫ్టీ అధికారులు ఇలాంటివి జరగ్గానే ఏదో నామమాత్రంగ తనిఖీలు చేస్తారు. ఆ తర్వాత అస్సలు పట్టించుకోరు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Cockroaches: వామ్మో.. ఒక దోశలో 8 బొద్దింకలు#foodsafety #delhipolice #madrascoffeehouse #cfss pic.twitter.com/bp0qzMGFzu
— Zee Telugu News (@ZeeTeluguLive) March 16, 2024
పూర్తివివరాలు..
దేశ రాజధాని న్యూఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. కన్నాట్ ప్లేస్‌లో ఉన్న మద్రాస్ కాఫీ హౌస్‌లో ఇషాని అనే మహిళ, తన స్నేహితుడితో కలసి వెళ్లింది. సాదా దోశలను ఆర్డర్ పెట్టింది. చాలా సేపటి తర్వాత సర్వర్లు, దోశలను తీసుకొచ్చి కస్టమర్ ముందు టెబుల్ మీద పెట్టారు. ఇక తిందామనుకుని దోశలను ఇష్టంగా చూశారు. ఇంతలో వారికి పురుగులాగా ఏదో కన్పించింది. వెంటనే మరింత నిశితంగా అబ్జర్వ్ చేయగా వారికి దోశలలో బొద్దింకలు కన్పించాయి. ఇలా దోశను పూర్తిగా అటు ఇటు తిప్పి చూడగా.. ఎనిమిది వరకు బోద్దింకలు ఉన్నాయి.
వెంటనే సదరు మహిళ తన ఫోన్ లో ఈ ఘటనను రికార్డు చేసింది. వెంటనే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్లేట్ లోని దోశలను క్లీన్ చేశారు. ఆ మహిళ మాత్రం ఈ ఘటనను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ దోశలను చూడటానికి వెరైటీగా ఉందని, పాడైపోయినట్లు స్మెల్ వస్తుందని కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
ప్రతిరోజు వేలాది మంది వచ్చే హోటల్ నిర్వాహణపై మండిపడుతున్నారు. ఇవి తింటే కస్టమర్ల ప్రాణాలకు ప్రమాదం కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వెంటనే ఫుడ్ సెఫ్టీ అధికారులు దీనిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బాధిత మహిళ కూడా పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook