Punjab National Bank KYC Update: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యగమనిక. కస్టమర్లందరూ తమ కేవైసీ సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని పీఎన్‌బీ సూచించింది. మార్చి 19న చివరి తేదీ అని.. RBI మార్గదర్శకాల ప్రకారం కస్టమర్లందరూ తమ కేవీసీ ఇన్ఫర్మేషన్‌ను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఒకవేళ కేవైసీ అప్‌డేట్ చేయకపోవతే అకౌంట్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.. అకౌంట్ కూడా హోల్డ్‌లో ఉంటుందని హెచ్చరించింది. కస్టమర్లు పీఎన్‌బీ బ్యాంక్‌లో లేదా ఇంటర్నెట్ బ్యాంక్, పీఎన్‌బీ యాప్‌లో కేవైసీ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.
Also Read: Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన్న
వినియోగదారులు తమ ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఫొటోగ్రాఫ్, పాన్ కార్డ్, ఇన్‌కమ్ ప్రూఫ్, మొబైల్ నంబర్ మొదలైన సమాచారం అందించాల్సి ఉంటుంది. కేవైసీ అప్‌డేట్ విషయం గురించి గుర్తు చేస్తూ బ్యాంక్ ఎస్‌ఎంఎస్ హెచ్చరికలను పంపింది. మార్చి 19వ తేదీ నాటికి వినియోగదారులు తమ కేవైసీని కంప్లీట్ చేయడంలో విఫలమైతే.. మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించలేరని తెలిపింది. మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి.. గడువు కంటే ముందే కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి కేవైసీ అప్‌డ అప్‌డేషన్‌కు బకాయిపడిన ఖాతాదారులు మార్చి 19, 2024లోపు దీన్ని చేయాలని పేర్కొంది.
పీఎన్‌బీ కేవైసీ స్టాటస్ ఇలా చెక్ చేసుకోండి..
==> మీ వివరాలతో పీఎన్‌బీ నెట్‌బ్యాకింగ్‌లో లాగిన్ అవ్వండి
==> పర్సనల్ సెట్టింగ్స్‌లో కేవైసీ స్టాటస్‌ను చెక్ చేయండి.
==> కేవైసీని అప్‌డేట్ చేయాల్సి ఉంటే.. స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను కాపాడుకోవడం, మనీలాండరింగ్, ఆర్థిక నేరాల నుంచి కస్టమర్లను రక్షించేందుకు కేవైసీ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించాలి. కస్టమర్ సమాచారం కచ్చితమైనదని నిర్ధారించుకోవడంతోపాటు బ్యాంకులు తమ ఖాతాదారుల తాజా అడ్రస్‌ను తమ వద్ద పొందుపొరుచుకుంటాయి. కస్టమర్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుంది.
Also Read: YCP Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ భారీ బస్సు యాత్ర, రోజుకో సభ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter