NTR: నందమూరి వారసుడు మొదటి సినిమాకి రంగం సిద్ధం.. ఎన్టీఆర్ వీరాభిమాని దర్శకుడిగా!

YVS Chowdhary: వైవిఎస్ చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానైన ఈ దర్శకుడు తన ప్రతి సినిమా మొదట్లో రామారావు ఫోటో వేసి మొదలుపెడతారు. అలాంటి ఈ దర్శకుడి చేతుల మీదుగా నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2024, 04:15 PM IST
NTR: నందమూరి వారసుడు మొదటి సినిమాకి రంగం సిద్ధం.. ఎన్టీఆర్ వీరాభిమాని దర్శకుడిగా!

Nandamuri Tara Ramarao: వైవిఎస్ చౌదరికి సీనియర్ ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానం అంత ఇంత కాదు. తన ప్రతి సినిమాని సీనియర్ ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తూనే మొదలుపెడుతారు. అలాంటి ఈ దర్శకుడు ఇప్పుడు నందమూరి వారసుడిని సినిమాల్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారట.

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్లు అందించారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. సీతారాముల కళ్యాణం చూతము రారండి, ‌సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు ఇలా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు.. సూపర్ హిట్లు సాధించాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ డైరెక్టర్ కి చెప్పుకోదగ్గ విజయం రాలేదు. ముఖ్యంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈయన తీసిన రేయి చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తరువాత వైవిఎస్ చౌదరి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే సినిమాలు తీయడానికి దూరంగా ఉన్న.. సినిమా ఈవెంట్స్ కి మాత్రం తరచూ అటెండ్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో మరోసారి వైవిఎస్ చౌదరి ఒక సినిమాకి త్వరలోనే దర్శకత్వం వహించబోతున్నారట. ఈ సినిమా ద్వారా నందమూరి వారసుడిని ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం.

కాగా ఆ హీరో మరెవరో కాదు దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత నందమూరి జానకిరామ్ తనయుడు. ఈ అబ్బాయిని హీరోగా పెట్టి వైవిఎస్ చౌదరి త్వరలోనే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. నందమూరి జానకిరామ్ కొద్ది సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. అతని పెద్ద కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు.  దీంతో ఈ ఎన్టీఆర్ ని కూడా వైవిఎస్ చౌదరి లాంచ్ చేయబోతున్నారట.

గతంలో హీరో రామ్ ని దేవదాస్ సినిమా ద్వారా, సాయిధరమ్ తేజ్ ని రేయ్ సినిమా ద్వారా వైవిఎస్ చౌదరి లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వారసురుని కూడా ఒక మంచి యూత్ ఫుల్ ప్రేమ కథతో లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట ఈ దర్శకుడు.
మరి ఈ చిత్రంతో నందమూరి హీరోని లాంచ్ చెయ్యడమే కాకుండా వైవిఎస్ చౌదరి కూడా మంచి కమ్ బ్యాక్ ఇస్తారేమో వేచి చూడాలి. కాగా ఈ ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సొంతం బాబాయిలు కావడం వల్ల.. ఈ వారసుడు సినీ రంగ ప్రవేశానికి నందమూరి సూపర్ హీరోల నుంచి తప్పకుండా సూపర్ సపోర్ట్ ఉండబోతుందని వినికిడి.

Also Read: Viral Video: షాకింగ్ లో మహిళ.. రీల్స్ చేస్తుండగా ఆ పనికానిచ్చిన ఆగంతకుడు.. వీడియో వైరల్..

Also Read: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News