NASA CADRE Mission: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సరికొత్త ప్రయోగానికి తెరతీస్తోంది. మినీ ఆటోనమస్ రోవర్ పరీక్ష విజయవంతమైంది. సూట్‌కేస్ సైజులో ఉండే బుల్లి రోవర్ వచ్చే ఏడాది చంద్రునిపై అడుగెట్టనుంది. ఈ బుల్లి రోవర్ చంద్రుని ఉపరితలంపై 3 డి మ్యాప్ తయారు చేసి పంపించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NASA CADRE Mission: నాసా ఈ మినీ రోవర్‌ను కోఆపరేటివ్ ఆటోనమస్ డిస్ట్రిబ్యూటెడ్ రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్ CADRE కింద తయారు చేసింది. నాసా తయారు చేసిన ఈ సూట్‌కేస్ సైజ్ రోవర్‌ను జెట్ ప్రొపల్షన్ లేబరేటరీకు చెందిన మార్స్ యార్డ్‌లో పరీక్షించింది. చంద్రుని ఉపరితలంపై ఉండే ఎగుడు దిగుడు , రాళ్లు రప్పలపై ఈ రోవర్‌ను పరీక్షించి చూశారు.
CADRE మిషన్ లాంచ్ ఎప్పుడు మూడు CADRE రోవర్ల పరీక్ష పూర్తయిందని నాసా ఇప్పటికే ప్రకటించింది. త్వరలో నోవా సి ల్యాండర్‌తో ఇంటిగ్రేట్ చేయనుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చంద్రునిపై ప్రయోగించనుంది. ఈ రోవర్ చంద్రుని రీనర్ గామా ప్రాంతంలో అడుగెట్టనుంది.
అద్బుతమైన కో ఆర్డినేషన్ ఈ రోవర్లకు ఎలక్ట్రో మేగ్నెటిక్ ఇంటర్ ఫేస్ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ కూడా చేశారు. దీంతో రోవర్ యెక్క ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్ ఒకదానికొకటి అడ్డంకిగా మారకుండా చేస్తుంది.
చంద్రుని ఉపరితలంపై 3డి మ్యాప్ చంద్రునిపై అడుగెట్టేందుకు సిద్ధమైన ఈ రోవర్లో పవర్ కోసం సోలార్ ప్యానెల్స్ అమర్చారు. కెమేరా, సెన్సార్లు, రాడార్ సహిత రోవర్‌తో చంద్రుని 3డి మ్యాప్ తీయనుంది. మార్స్ యార్డ్‌పై పరీక్ష తరువాత వైబ్రేషన్ అండ్ ధర్మల్ టెస్ట్ కూడా నిర్వహించారు.