Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?

Why Klin Kaara Bald Hair: మెగాస్టార్‌ చిరంజీవి మనమరాలు.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార గుండులో కనిపించింది. క్లీంకారకు గుండు చేయించారా? ఎందుకు చేయించారని చర్చ జరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2024, 05:03 PM IST
Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?

Klin Kaara: పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత రామ్‌చరణ్‌కు సంతానం కలగడంతో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం పరమానందం పొందుతున్న విషయం తెలిసిందే. పాప పుట్టినప్పటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్లీంకార బాబోగులు చూసుకునేందుకు భారీగా ఖర్చు చేసి మహారాష్ట్రకు చెందిన ఓ ఆయాను తీసుకువచ్చారని సమాచారం. ప్రస్తుతం ఆమె సంరక్షణలో పాప పెరుగుతుందని తెలుస్తోంది. ఇక క్లీంకారకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరంగా ఉంటున్నాయి. తాజాగా ఉపాసన పంచుకున్న ఓ ఫొటో ఆసక్తికరంగా మారింది. క్లీంకార గుండులో కనిపించింది. 

Also Read: Ranbir Kapoor: 'యానిమల్‌' హీరో రణ్‌బీర్‌ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఈ కారు ఫీచర్లు, ధర తెలిస్తే షాకే..

సినిమాలు, వ్యాపారాల నుంచి కొంత విరామం తీసుకున్న రామ్‌చరణ్‌, ఉపాసన తమ కుమార్తెతో గడుపుతున్నారు. ఆదివారం తన సోషల్ మీడియాలో ఉపాసన ఒక ఫొటో పంచుకుంది. ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తూ రామ్‌చరణ్‌, ఉపాసన, క్లీంకార కనిపించారు. ఉపాసన ఎత్తుకున్న క్లీంకార గుండులో కనిపించింది. తల్లిదండ్రులు ఏనుగుకు స్నానం చేపిస్తుండగా క్లీంకార ఆసక్తిగా గమనిస్తూ ఉంది. 'ధన్యవాదాలు నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఏనుగుల సంరక్షణ క్యాంపులో చాలా నేర్చుకున్నా' అని ఉపాసన పోస్టు చేసింది.

Also Read: Nikhil Siddhartha Twist: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ బిగ్‌ ట్విస్ట్.. టీడీపీలో చేరలేదంటూ ప్రకటన

ఈ పోస్టు మెగా అభిమానులు లైక్‌ల మీద లైకులు కొడుతున్నారు. అయితే ఫొటోలో క్లీంకారపైనే అందరి దృష్టి. పాపకు ఎందుకు గుండు చేయించారు అని చర్చిస్తున్నారు. క్లీంకారకు ఏమైంది? ఎందుకు గుండు చేయించారని సందేహాలు లేవనెత్తుతున్నారు. అయితే క్లీంకార గుండు విషయమై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. క్లీంకారకు ఇటీవల గుండు చేయించారని తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట తన పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్‌ ఉపాస, క్లీంకారతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే క్లీంకారకు తిరుమలలో గుండు చేయించారని సమాచారం. తండ్రి పుట్టినరోజు నాడే క్లీంకారకు పుట్టు వెంట్రుకలు తీయించారని తెలుస్తోంది. తిరుమల దర్శనం సమయంలో జుట్టుతో కనిపించిన క్లీంకార ఇప్పుడు గుండుతో కనిపించడం గమనార్హం. 

తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు తమ చిన్నపిల్లల పుట్టు వెంట్రుకలు తిరుమలలో చేయిస్తుంటారు. శ్రీవారికి పుట్టువెంట్రుకలు సమర్పించే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అదే సంప్రదాయాన్ని రామ్‌చరణ్‌, ఉపాసన పాటించారని తెలుస్తోంది. గుండులో కూడా క్లీంకార అందంగా కనిపిస్తోంది. కాకపోతే క్లీంకార ఫొటోలు స్పష్టంగా కనిపించడం లేదు. ఉపాసన కానీ, రామ్‌చరణ్‌ గానీ, ఇతర కుటుంబసభ్యులు ఎవరూ క్లీంకారకు సంబంధించిన ఫొటోలు అధికారికంగా విడుదల చేయడం లేదు. ప్రస్తుతం నెలల పాప కావడంతో క్లీంకారను ప్రజలకు చూయించడం లేదనే వార్త వినిపిస్తుంది. పాప ఫొటో విడుదల చేస్తే ప్రజల దిష్టి.. ముఖ్యంగా నర దిష్టి కలిగి పాపకు ఏమైనా జరుగుతుంది అనే ఆందోళన ఉండవచ్చు. లేకపోతే పాప వ్యక్తిగత జీవితం కోసం ఫొటోను పంచుకోవడం లేదని కూడా భావించవచ్చు. ఏది ఏమైనా మెగా కుటుంబం క్లీంకార రాకతో ఆనందంతో ఉంది. 

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విశాఖపట్టణంలో షూటింగ్‌ అనంతరం చెర్రీ కొంత విరామం తీసుకున్నాడు. తన కుమార్తె, భార్యతో కలిసి థాయిలాండ్‌ పర్యటనకు వెళ్లారని తెలుస్తోంది. అక్కడి ఏనుగుల శిబిరంలో వీళ్లు ఇద్దరు ఉన్నారు. తర్వాతి సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ చేయనున్నాడు. అనంతరం రంగస్థలం కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రామ్‌చరణ్‌ సిద్ధమయ్యాడు.

 
 
 
 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x