Tollywood Movies: ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితమైన టాలీవుడ్ క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. రాజమౌళి బాహుబలి సినిమా పుణ్యమా అని ఇప్పుడు తెలుగు సినిమాకి ఫాన్స్ బీభత్సంగా పెరిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు తెలుగు సినిమాల కోసం కూడా క్యూ కడుతున్నారు.
మరోవైపు టాలీవుడ్ కూడా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్ అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలుగు సినిమాని కనీసం డబ్బింగ్ కూడా చేసి రిలీజ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించని ఉత్తరాది నిర్మాతలు ఇప్పుడు రీమేక్ రైట్ల కోసం కూడా ఎగబడుతున్నారు.
ఇక స్టార్ హీరో సినిమా అయితే చాలు ఓటీటీ లు కూడా డిజిటల్ రైట్స్ కోసం భారీ ఎత్తున ఎగబడుతున్నాయి. ఈ ఏడాది కూడా చాలామంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. వాటి మీద అంచనాలు కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కల్కి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
విడుదల తేదీ ఫిక్స్ అవ్వగానే చిత్ర బృందం ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా ఈజీగా రెండువేల కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంటుందని ఉంటుందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. అల్లు అర్జున్ పుష్ప సినిమా నార్త్ లో కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాకి కూడా అంతే క్రేజ్ ఉంది.
ఈ సినిమా హక్కుల గురించి కూడా షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప కోసమే అజయ్ దేవగన్ కూడా తన సింగం సినిమాని ఆగస్టు 15 నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ మీద కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నార్త్ లో ఈ సినిమాకి భారీ డీల్స్ వస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ వన్ సినిమా కోసం కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ జి సినిమా కోసం కూడా అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. నాని సరిపోదా శనివారం, ప్రభాస్ రాజా సాబ్, నిఖిల్ స్వయంభు, ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాల మీద కూడా బోలెడు అంచనాలు ఉన్నాయి.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
Also Read: Cash For Vote: రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter