AC Power Saving: ఎండ వేడి కంటే కరెంట్ బిల్ ఎక్కువగా ఉందా.. అయితే ఇలాంటి ఏసి కొనాల్సిందే

AC power saving tips: వేసవికాలం రాగానే బయట ఎండల కంటే ఎక్కువగా ప్రజలు భయపడేది ఏసీ వల్ల వచ్చే కరెంట్ బిల్లు వల్ల. ఏసి వాడుతుంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కానీ అందరూ అనుకుంటారు కానీ అది మనం కొని పవర్ రేటింగ్ ఉన్న ఏసీ మీద ఆధారపడి ఉంటుంది అసలు ఎంత పవర్ రేటింగ్ ఉన్న ఏసీ అయితే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అని తెలుసుకోవాలి

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 24, 2024, 05:39 PM IST
AC Power Saving: ఎండ వేడి కంటే కరెంట్ బిల్ ఎక్కువగా ఉందా.. అయితే ఇలాంటి ఏసి కొనాల్సిందే

Summer current bill: మధ్యాహ్నం కూడా అవ్వకుండానే బయట వడగాలులు వీస్తున్నాయి. ఎండాకాలం ఈ సారి చాలా త్వరగా మొదలైంది. ఉక్కపోత కూడా పోయిన ఏడాది మీద ఎక్కువగానే ఉంది. ఇక సూర్యుడు ప్రజల మీద పగ పట్టినట్టే భగ భగా మండుతూ ఉష్ణోగ్రతను పెంచుతున్నాడు. వేడి నుంచి ఉపశమనం కోసం కూలర్ కంటే ఎక్కువ ప్రజలు ఏసీ బెటర్ అని కొనుగోలు చేస్తారు. కానీ నెలాఖరు వచ్చేసరికి కరెంట్ బిల్ చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది.

ఏసీ వినియోగం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది చాలా మంది చెబుతారు. కానీ అందులో అది పూర్తిగా నిజం కాదు. ఏసీ వాడుతున్నామా లేదా అని కాదు ఎలాంటి ఏసీ వాడుతున్నాం అనే దాని మీద కూడా కరెంట్ బిల్ ఆధారపడుతుంది. అందుకే ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఎంత స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి అనే విషయం గురించి మనం సరిగ్గా తెలుసుకోవాలి.  

ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్ సపోర్ట్‌ కూడా ఉన్న ఏసీ లలో 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ పవర్ రేటింగ్ ఉన్న రకరకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏసీ రేటింగ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట.  2 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కంటే 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మన కరెంటు బిల్లు ను ఆదా చేస్తుంది.

ఇంట్లోకి వాడుకోవడానికి 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ సరిపోతుందట. వేసవి కాలం మాత్రమే ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా సీజన్స్ లో ఏసీ వాడటం చాలా తక్కువ. పైగా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రదేశాల్లో వింటర్ లో ఏసీ వాడాల్సిన అవసరం పడదు. కాబట్టి 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ ఇంట్లోకి కరెక్ట్ గా సరిపోతుంది. 

ఒకవేళ ఏసీ ని మీరు కమర్షియల్ పనులకోసం వాడాలి అనుకుంటే ఎక్కువ పవర్ రేటింగ్‌తో ఉన్న ఏసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఏసీ రోజంతా ఆన్ లోనే ఉండాలి కాబట్టి విద్యుత్ ఆదా చేయాలి అంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోండి. ఇక ఏసీ ఇంటి కోసం అయితే 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ సరిపోతుంది.

Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News