Samantha: కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్గా హీరోయిన్గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సమంత దాదాపు దశాబ్దంన్నరగా సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది. అందులో 'శాకుంతలం', యశోదా,సూపర్ డీలక్స్ వంటి డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి.
ఏమాయా చేసావే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు వంటి వరుస హిట్స్‌తో తొలి మూడు సినిమాలతోనే హాట్రిక్ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సమంత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగ'లో ప్రేమికుడిని కోల్పోయిన యువతి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయింది. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికీ దారేది' మూవీలో శశిగా ఒదిగిపోయిన తీరును అభిమానులు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
ఇక అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సినిమాలో ప్రియ పాత్రలో ఒదిగిపోయింది సమంత. ఈ సినిమా తర్వాత అక్కినేని వారింటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.
సమంత అక్కినేని అటు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఈమె జీవితంలో కీ రోల్ పోషించాయి. అటు విడాకుల తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తోంది.
సమంత, చైతూ అటు వెబ్ సిరీస్‌లో కూడా రాణిస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది. త్వరలో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతుంది.
సమంత వెబ్ సిరీస్ ఆ మధ్య మయసిటీస్తో బాధపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. మళ్లీ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించింది. ఇన్నేళ్ల కెరీర్లో ఈమె కెరీర్ తొలినాళ్లలో రూ.40 లక్షల నుంచి ఇపుడు రూ.. 3 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది.
సమంత సినిమాల్లో వచ్చిన దానిని మ్యూచవల్ ఫండ్స్‌తో పాటు.. ముంబై, చైన్నై,బెంగళూరు, హైదరాబాద్‌లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంత భరణం వచ్చింది. మొత్తంగా సమంత ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు వుంటుందని సినీ వర్గాల సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.