BRS: సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై..

BRS: సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ నేత ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 2, 2024, 10:21 AM IST
BRS: సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై..

BRS: తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారిన షాక్ నుంచి కోలుకోకముందే మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆదిలాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఆల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆ తర్వాత గాంధీ భవన్‌లో కాంగ్రెస్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు పంపారు. ఇటీవలె జరిగిన అసెంబ్లీ ఎలక్షన్‌లో నిర్మల్ స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్ధి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. అప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా రెండు నెలల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి హస్తం గూటికి చేరారు. మరోవైపు ఇంద్రకరణ్ రెడ్డి రాకను ముందుగా స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా.. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇంద్రకరణ్‌ రెడ్డి రాకకు మార్గం సుగమం అయింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఆదిలాబాద్‌లో బలమైన బీఆర్ఎస్ నేతను తమ పార్టీలో చేర్చుకోవడంతో ఆదిలాబాద్ లోక్ సభ సెగ్మెంట్‌పై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి రాకతో ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీలోకి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్ల్యే కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శ్రీహరి కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీ తరుపున వరంగల్ ఎంపీగా పోటీ చేస్తోంది. అటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కారు దిగి హస్తం గూటికి చేరారు. అంతేకాదు ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో ఉన్నారు.

Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News