Vitamin D Deficiency Symptoms: మన శరీరానికి విటమిన్‌లు చాలా అవసరం. విటమిన్ లోపం కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అందులోను విటమిన్ డి కీలక ప్రాత పోషిస్తుంది. దీని వల్ల ఎముకలు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, శరీర పనితీరు మెరుగుపడుతుంది. ఈ విటమిన్ డిని మనం ప్రతిరోజు ఉదయం సూర్యకాంతి నుంచి కూడా పొందవచ్చని వైద్యులు చెడుతున్నారు. అయితే కొన్ని సార్లు మీరు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి తీసుకోవచ్చు.
కొన్ని సార్లు కొంతమందిలో విటమిన్ డి లోపిస్తుంది. దీని కారణంగా వారు అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. అందులో ముఖ్యంగా ఎముకల నొప్పి, కీళ్ల నొప్పి, అలసట, జుట్టు రాలడం, గాయాలు నయం కాకపోవడం, మూడ్ స్వింగ్స్ ఇలా ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. దీని కారణంగా మీరు చరుకుగా పనిచేసుకోలేకపోతారు. ఇలాంటి సమయంలో విటమిన్ డి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మీ ఆహారంలో ఈ పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
విటమిన్ డి ఎక్కువగా ఎండు ఖర్జూరాలలో లభిస్తుంది. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డ్రై ఫూట్స్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాల్‌నట్లు తీసుకోవడం వల్ల కూడా పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా విటమిన్‌లు, మినరల్స్, ఒమేగా-౩ వంటి పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే బాదం పప్పు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఆప్రికాట్లు విటమిన్ డి ని అందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్‌లు, మినరల్స్, ఫైబర్ శరీరానికి దృంఢంగా తయారు చేస్తాయి. జీడిపప్పు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి.
మీరు ఆహారం ద్వారా తగినంత విటమిన్ డి పొందలేకపోతే, సప్లిమెంట్ తీసుకోవాలని మీ వైద్యుడు సిఫార్సు చేయవచ్చు. విటమిన్ డి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి మీకు సరైనదాన్ని కనుగొనడానికి మీ వైద్యుడితో మాట్లాడండి. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని మీరు ఆందోళన చెందుతుంటే, మీ వైద్యుడితో మాట్లాడండి. వారు మీ స్థాయిలను పరీక్షించవచ్చు మీకు అవసరమైన చికిత్స లేదా సప్లిమెంటేషన్‌ను సిఫార్సు చేయవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి