Brown bread health benefits: సాధారణంగా మనందరి ఎక్కువ శాతం వైట్ బ్రెడ్ తింటాం కానీ, అది అనారోగ్యకరం. ఇందులో మైదా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయాయి. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి అయితే బ్రౌన్ బ్రెడ్ కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. దీంతో 7 ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం.
ఫైబర్..
బ్రౌన్ బ్రెడ్ లో రకరకాల వెరైటీలు తృణధాన్యాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇది వైట్ బ్రెడ్ లో ఉండదు. ఈ ఫైబర్ మన కడుపు సంబంధించిన సమస్యలకు తెచ్చి పెడుతుంది. మంచి జీవితం ఆరోగ్యానికి పేగు కదలికలకు తోడ్పడుతుంది.
పోషకాలు పుష్కలం..
హోల్ వీట్ పిండితో తయారుచేసిన హోల్ బ్రెడ్ లో నిజంగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే తెల్ల బ్రెడ్ లో మాత్రం రిఫైండ్ పిండితో తయారుచేస్తారు. బ్రౌన్ బ్రెడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం కూడా పుష్కలంగా ఉంటాయి.
గ్లైసేమిక్ ఇండెక్స్..
వైట్ బ్రేడ్ తో పోలిస్తే బ్రౌన్ బ్రడ్ లో గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదులో ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరగదు. ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇది టైప్ టు డయాబెటిస్ కి కారణం అవుతుంది.
గుండె ఆరోగ్యం..
ఈ హోల్ వీట్ బ్రెడ్ లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. తరచూ తీసుకోవడం వల్ల ఇది గుండె సమస్యలను స్ట్రోక్ ను తగ్గిస్తుంది.
బరువు నిర్వహణ...
బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కొద్దిగా తీసుకున్న అది కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయదు
ఎక్కువ తీసుకోకుండా ఉంటాం. ఇది బరువు తక్కువ కావాలనుకునే వారికి మంచి ఆప్షన్.
ఇదీ చదవండి: మీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుందా? ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు..
జీర్ణ ఆరోగ్యం..
అంతేకాదె బ్రౌన్ బ్రెడ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మంచి పేగు కదలికలకు తోడ్పడుతుంది ఇది మలబద్ధకం సమస్యను చెక్ పెట్టి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: వేసవిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య రావచ్చు.. ఈ వంటగది వస్తువులు ఉపశమనం..
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్..
బ్రౌన్ బ్రెడ్ తరచు తీసుకోవడం వల్ల ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. క్యాన్సర్, క్యార్డియా వాస్కులర్ డిసీస్ లాంటి దీర్ఘకాలక వ్యాధులకు గ్రౌండ్ బ్రేక్ చెక్ పెడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook