వినయ విధేయ రామ మూవీ 2 రోజుల కలెక్షన్స్

వినయ విధేయ రామ మూవీ 2 రోజుల కలెక్షన్స్

Last Updated : Jan 13, 2019, 08:57 PM IST
 వినయ విధేయ రామ మూవీ 2 రోజుల కలెక్షన్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వాని జంటగా భారీ అంచనాల మధ్య విడుదలైన వినయ విధేయ రామ మూవీ మిశ్రమ స్పందనల మధ్యే దూసుకుపోతోంది. ఈ సినిమా గురించి వినిపించిన అభిప్రాయాలు ఏవీ వినయ విధేయ రామ కలెక్షన్స్‌పై ప్రభావం చూపలేకపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతానికి వినయ విధేయ రామ మూవీ సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. తాజాగా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం మేరకు తొలి 2 రోజుల షేర్ ఇలా వున్నాయి.

ఏపీ, నైజాం 2 రోజుల షేర్
నైజాం          – రూ. 6.79 కోట్లు
సీడెడ్          – రూ. 7.56 కోట్లు
ఉత్తరాంధ్ర     – రూ. 3.05 కోట్లు
ఈస్ట్ గోదావరి– రూ. 2.32 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 2.08 కోట్లు
గుంటూరు     – రూ. 4.52 కోట్లు
కృష్ణా           – రూ. 1.80 కోట్లు
నెల్లూరు       – రూ. 1.85 కోట్లు

Trending News