Infinix Gt 20 Pro 5G Price: అమ్మబాబోయ్‌ మాములు ఆఫర్‌ కాదు.. Infinix Gt 20 Pro మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్!

Infinix Gt 20 Pro 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Infinix GT 20 Pro మొబైల్‌ మొదటి సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ‌ 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 28, 2024, 03:45 PM IST
Infinix Gt 20 Pro 5G Price: అమ్మబాబోయ్‌ మాములు ఆఫర్‌ కాదు.. Infinix Gt 20 Pro మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్!

Infinix Gt 20 Pro 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) మొబైల్స్‌ మార్కెట్‌లో సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. గత వారం లాంచ్‌ చేసిన Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించింది.  ఈ మొబైల్‌ మొదటి సేల్‌లోనే మంచి గుర్తింపు రికార్డులు బద్దలు కొట్టింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ Infinix GT 20 Pro మొబైల్‌ మూడు విభిన్న రంగుల్లో అందబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఎలాంటి ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
  
 ఇన్ఫినిక్స్ GT 20 ప్రో మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌:
ఈ Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అధికారిక ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించివచ్చు. దీనిని ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి కూడా ఈ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి రూ. 5,499 విలువైన ఉచిత గేమింగ్ కిట్‌ను కూడా పొందవచ్చు. 

Infinix GT 20 Pro ఫీచర్ల వివరాలు:
మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ మొబైల్‌ MediaTek Dimensity 8200-Ultimate చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ 12GB LPDDR5X ర్యామ్‌తో పాటు 256GB UFS 3.1 ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. అలాగే ఇది 5,000 mAh బ్యాటరీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. సులభంగా ఛార్జ్‌ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జన్‌ను అందిస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించి కెమెరా ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్‌లో 108MP ప్రధాన కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు 2MP మాక్రో, 2MP డెప్త్ సెన్సార్‌ కెమెరాలతో రాబోతోంది. అలాగే ఇందులో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌  6.78-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1,300 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తోంది. అలాగే రెండు సంవత్సరాల Android OS అప్‌డేట్‌తో ఈ మొబైల్‌ లభిస్తోంది.   

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News