ZEE News Exit Polls Updates: ఎంతో ఉత్కంఠ రేపుతున్న జీ న్యూస్ సర్వే రిపోర్ట్ వచ్చేసింది. బీజేపీ నినాదం చార్‌సౌ సీట్లు అందుకునే ఛాన్స్ లేదని సర్వే తేల్చింది. అంతేకాకుండా 2019లో గెలిచిన స్థానాలకంటే భారీగా సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా.. యూపీఏకి 91 సీట్లు, ఇతరులు 99 స్థానాలను దక్కించుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు భారీగా పుంజుకుంటున్నట్లు సర్వేలు తేలుస్తున్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సరళిపై జీ న్యూస్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సర్వే నిర్వహించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రోడికరించిన సమాచారంతో సర్వే నిర్వహించింది. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి..? ఇండి కూటమి పుంజుకుంటుందా..? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభావం ఎంత..? జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.