AP Rains Alert: వాతావరణ శాఖ ఊహించినట్టే ముందస్తుగా రుతు పవనాలు వచ్చేశాయి. కేరళ తీరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం అనుకున్నట్టే ముందుగా తాకాయి. మొన్న అంటే శనివారం రాత్రికి రాయలసీమను తాకిన రుతు పవనాలు నిన్న ఆదివారం ఉత్తరాంధ్రకు చేరాయి.
ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇవాళ అంటే సోమవారం దక్షిణ కోస్తాలోకి ఎంటర్ ఇవ్వనున్నాయి. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటం వల్ల పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వ్యాపించనున్నాయి. అటు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో దక్షిమ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కడప జిల్లాలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో వర్షాల కారణంగా పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.
నిన్న విశాఖపట్నంలో భారీ వర్షం, పిడుగులు జనాన్ని భయపెట్టాయి. నిన్న రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం దాదాపు గంటకుపైగా కురిసింది. విశాఖపట్నం, గాజువాక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పిడుగుల కారణంగా విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇక ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. విజయనగరం, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఉరుములు, పిడుగులు పడే ప్రమాదముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
Also read: Toll Fee Hike: ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ధరల బాదుడు, 5 శాతం పెరిగిన ఫీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook