Heavy rains: తెలుగురాష్ట్రాల్లో కుండపోతే.. రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..

Weather forecast: రెండు తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు జోరుగా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 7, 2024, 12:06 PM IST
  • హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్..
  • సాయంత్రంపూట అప్రమత్తంగా ఉండాలంటున్న ఐఎండీ..
Heavy rains: తెలుగురాష్ట్రాల్లో కుండపోతే.. రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..

Rain fall Alert in andhra pradesh and telangana: కొన్నిరోజులుగా ఎండ వేడికి అల్లాడిపోయిన జనాలకు చల్లని కబురు అని చెప్పుకొవచ్చు.  కనీసం బైటకు వెళ్లేందుకు కూడా జనాలు అల్లాడిపోయారు. ఎండ దెబ్బలకు జనాలు తల్లడిల్లిపోయారు. ఇక వడదెబ్బకు అనేక మంది జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఇదే క్రమంలో.. వాతావరణ  శాఖ తెలుగు రాష్ట్రాలకు తీపికబురు చెప్పింది. ఇప్పటికే రెండు తెలుగు స్టేట్స్ లలో రుతుపవనాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.  కొన్నిరోజులుగా సాయంత్రం పూట ఉరుములు,మెరుపులతో ఒక మోస్తరు వర్షంకురుస్తుంది.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

భారీ నుంచి అతిభారీగా వర్షపాతం నమోదవుతుంది.ఈ క్రమంలో.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షంకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ఇరు తెలుగు స్టేట్స్ లలో కూడా సాయంత్రం కాగానే ఆకాశంలో భారీగా నల్లటి మేఘాలు కమ్ముకుని వర్షాలు పడుతున్నాయి. దీంతో భారీగా వర్షం నమోదవుతుంది. ఇప్పటికే వాతారణ కేంద్రం హైదరాబాద్ కు యేల్లో అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా సాయంత్రంపూట వర్షాలు పడుతుండటంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు..

వర్షాలుకురుస్తుండటంతో  జీహెచ్ ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నాలాలా దగ్గర హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా... మ్యాన్ హోల్స్ లో చెత్త చెదారం ఆగకుండా చర్యలుచేపట్టారు. మరోవైపు ప్రజలు రోడ్డుమీద వెళ్లేటప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోడ్డుమీద చెట్లుపడిపోతే.. వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులకు ఫోన్ లు చేయాలని సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలర్ట్ గా ఉంటుందని జీహెచ్ఎంసీ సిబ్బంది పేర్కొంటున్నారు.

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఇవే..

సాయంత్రం పూట అందరు ఒకే సమయంలో ఇళ్లకు వెళ్లేందుకు బైటకు వస్తుంటారు. ఒక వైపు వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని, సమయాలలో ఏదైన వెసులుబాట్లు ఉంటే చేసుకొవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ వయోలేషన్ లు పాల్పడకుండా ఉండాలని సూచిస్తున్నారు. వాహన ప్రమాదాలు జరక్కుండా.. వెహికిల్ లను జాగ్రత్తగా నడిపించాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు.

 

 

Trending News