Niharika Konidela: మొత్తం పైన మెగా-అల్లు ఫ్యామిలీ గొడవ గురించి క్లారిటీ.. ఇక ఇద్దరికీ తెగినట్టే!

Allu Arjun vs Pawan Kalyan: గత కొద్ది రోజులుగా.. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ.. మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి.. అంటూ వార్తలు రాసాగాయి. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక చేసిన కామెంట్స్ తో.. ఈ వార్తల్లో నిజము తప్పకుండా ఉంది అని తెలుస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 15, 2024, 03:58 PM IST
Niharika Konidela: మొత్తం పైన మెగా-అల్లు ఫ్యామిలీ గొడవ గురించి క్లారిటీ.. ఇక ఇద్దరికీ తెగినట్టే!

Pawan Kalyan: 
గత కొద్ది రోజులుగా.. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ.. మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కి..పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో రచ్చ ఉంది.. అన్నట్టు వార్తలు రాసాగాయి. మొదట్లో మా మామయ్య అంటూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడిన ఈ హీరో.. ఆ తరువాత ‘చెప్పను బ్రో’ అనే స్టేజ్ కి వచ్చారు. ఇక అక్కడి నుంచి..వీళ్ళ మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి.. అని వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ వార్తలు కాస్త.. మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రచారం తరువాత.. మరింత ఆజ్యం పోసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో.. పవన్ కళ్యాణ్ జనసేన ప్రతిపక్ష పార్టీ అయిన..వైసిపి అభ్యర్థి శిల్పారవిచంద్రరెడ్డికి.. అల్లు అర్జున్ బహిరంగ మద్దతు ఇచ్చినప్పటి నుంచి 
మెగాభిమానులు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మరింత వేడి రాజుకుంది. 

అది కేవలం తన స్నేహితుడికి సపోర్ట్ తప్ప పార్టీకి కాదని, జనసేన గెలవాలని కోరుకుంటున్నానని.. అల్లు అర్జున్ వివరణ ఇచ్చినప్పటికీ వేడి చల్లారలేదు. ముఖ్యంగా నాగబాబు.. మాతో ఉంది పక్కన వాళ్ళకి.. సపోర్ట్ చేసేవాళ్లు.. ఎప్పటికీ పరాయి వాళ్లే.. అని పెట్టిన ట్వీట్.. సోషల్ మీడియాలో మరింత అభిమానం రేపింది.

ఇక ఈ ట్వీట్ వచ్చి కొన్ని రోజులు కాకముందే..
ఇటీవలే సాయి ధరం తేజ్.. సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చెయ్యడం.. మరిన్ని చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయంపై ఎప్పుడు నిహారిక సైతం స్పందించింది. దీని గురించి నిన్న జరిగిన కమిటీ కుర్రాళ్ళు టీజర్ లాంచ్ లో నిర్మాత, మెగా డాటర్.. నిహారిక  నుంచి ఊహించని సమాధానం వచ్చింది. నిహారిక మాట్లాడుతూ ఈ విషయం తనకు తెలియదని క్షమాపణ చెబుతూ.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి అని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఈ విషయం గురించి నాకు పెద్దగా తెలియదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగి ఉంటే.. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కాబట్టి నా వైపు నుంచి చెప్పాల్సింది ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చింది. అయితే నిహారిక మెగా అల్లు హీరోల మధ్య విభేదాలు లేవని చెప్పి ఉంటే.. ఆ వీడియో ఇంతగా వైరలయ్యేది కాదు. వారి వారి కారణాలు‌.. వారికి ఉన్నాయి అని నిహారిక చెప్పడంతో.. తప్పకుండా హాలు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఏదో చిచ్చు నడుస్తోంది..అని అందరూ క్లారిటీ తెచ్చుకున్నారు.

చిరంజీవి, అల్లు అరవింద్ ఫ్యామిలీస్ మధ్య పొరపొచ్చాలు లేవని, పండగల లాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి కలుసుకొని ఫోటోలు తీసుకుంటున్న.. ఇలాంటి నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, సాయి తేజ్, నిహారిక ఈ రకంగా.. రియాక్ట్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో.. ఇక తప్పకుండా అల్లు అర్జున్ మెగా హీరో కాదు అంటూ.. తమ మద్దతు ఇక బన్నీకి ఉండదు అంటూ.. కామెంట్లు పెడుతున్నారు మెగా అభిమానులు

Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం

Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News