Tirumala Special Darshan And Laddu Price: తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరలు భారీగా తగ్గింపు అని వార్తలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటుకావడంతో తిరుమలపై ప్రత్యేక దృష్టి సారిచిన నేపథ్యంలో ధరల్లో మార్పులు జరిగాయని పుకార్లు వచ్చాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వార్తలు వ్యాప్తి చెందడంతో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ మేరకు ప్రజలకు టీటీడీ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది.
Also Read: Free Bus Scheme: ఏపీ మహిళలకు సూపర్బ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే..
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. లడ్డూ, ప్రత్యేక దర్శనం ధరలు తగ్గించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందిన సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేసింది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Also Read: Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
వదంతులు నమ్మవద్దు
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు అని విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల పేరిట సర్క్యులెట్ అవుతున్న సమాచారం ఎవరూ నమ్మవద్దని సూచించారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి అధికారి వెబ్‌సైట్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయించామని వివరించింది. భక్తులు సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే అవకాశం ఉందని గుర్తు చేశారు.
దళారులపై కఠిన చర్యలు
అంతేకానీ మిగతా ఎక్కడా దర్శనానికి సంబంధించిన టికెట్లు లభించవని టీటీడీ స్పష్టం చేసింది. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇస్తామని చెప్పి ఎవరైనా అడిగితే వారిపై తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Tirumala Price Down: తిరుమల దర్శనం టికెట్, లడ్డూ ధరలు తగ్గుదల.. టీటీడీ ఏం చెప్పింది?