Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటే

Credit Card Rules: క్రెడిట్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ నిబందనలు మారుతున్నాయి. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారుతోంది. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2024, 03:33 PM IST
Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటే

Credit Card Rules: బ్యాంకింగ్ వ్యవస్థ, యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. అదే విధంగా క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల విధానంలో మార్పు తీసుకొచ్చింది. కొత్త విధానం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు విధానం మారనుంది.

జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది. కొత్త నెల ప్రారంభం నుంచి క్రెడిట్ కార్డు బిల్లును భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే బీబీపీఎస్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్‌ను మరింత సౌకర్యవంతంగా, సెక్యూర్‌గా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. కొత్త విదానంలో బిల్ చెల్లింపు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రెగ్యులేషన్ ప్రకారం జూలై 1 నుంచి బారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలి. దాంతో జూలై 1 తరువాత క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్రెడ్, ఫోన్‌పే, బిల్ డెస్క్‌లలో సమస్య ఎదురుకావచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయని బ్యాంకులు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్‌లలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ విధానాన్ని ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు. ఇప్పటివరకూ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మాత్రమే ఈ విధానాన్ని పూర్తి చేశాయి.

పేమెంట్ సిస్టమ్‌ను మరింత సౌకర్యవంతంగా, సెక్యూర్‌గా మలిచేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిపి బీబీపీఎస్ ఒకటే ఏకీకృత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పింది. ఆర్బీఐ దీనికో డెడ్‌లైన్ విధించింది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే పేమెంట్ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

Also read: OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News