Health and Beauty Drink: ప్రస్తుతం ఉన్న గ్లామర్ ప్రపంచంలో వయసుతో.. సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు.. నిత్య యవ్వనంగా.. ఆరోగ్యంగా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బిజీ లైఫ్ స్టైల్ లో.. కసరత్తులు చేయడం, జిమ్ కి వెళ్లడం, యోగ, వాకింగ్ లాంటి వాటికి సమయం కుదరడం లేదు. మరికొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా .. ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండలేకపోతున్నారు. పైగా స్థూలకాయం ఒకటి.. ఈ మధ్యకాలంలో అందరినీ బాధిస్తోంది. అయితే మీరు కూడా బిజీ లైఫ్ స్టైల్ అందంగా .. ఆరోగ్యంగా.. ఉండడానికి సమయాన్ని.. కేటాయించలేకపోతున్నట్లయితే మీకోసం ఒక హెల్దీ డ్రింక్ తీసుకురావడం జరిగింది. ఈ డ్రింక్ తాగడం వల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు..
ముఖ్యంగా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. పలు ఆహార పదార్థాలతో.. వివిధ మార్గాలలో వీటిని ఉపయోగిస్తారు.. ముఖ్యంగా రాగులతో పిండి తయారు చేసి.. రాగి ముద్ద, రాగి గంజి, అంబలి, రాగి రోటి ఇలా పలు రకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటారు.
ముఖ్యంగా రాగులలో మనకు క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది.. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగులతో తయారు చేసిన గంజి పిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం వల్ల వారి ఎముకల పటిష్టానికి చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు.. ప్రత్యేకించి వృద్ధులు, మహిళలు తమ ఎముకలకు బలాన్ని అందించాలంటే.. తప్పకుండా రాగులతో తయారుచేసిన గంజి తీసుకోవాలి. ప్రత్యేకించి రాగి గంజి తీసుకోవడం వల్ల ఎలాంటి.. ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఇమ్యూనిటీ
రాగి పొడిలో మనకు ప్రోటీన్లు, విటమిన్ ఏ, బి , సి తో పాటు మినరల్స్ కూడా లభిస్తాయి. ఎముకల బలానికి సహాయ పడడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి.
బరువు తగ్గటం
ఈ జావ వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. ట్రిప్టో ఫాన్ ఆకలిని తగ్గిస్తుంది.. క్రమంగా బరువు అదుపులో ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది.
చర్మం మెరవడం
నిత్యం రాగులు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ మృదువుగా మారుతుంది. దీంతో 60లో కూడా 16 లా కనిపించవచ్చు .
మరెన్నో ప్రయోజనాలు..
ఇక ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులకు కూడా చక్కటి ఔషధం. ఇలా మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది నిత్యం యవ్వనంలో.. కనిపించేటట్టు చేస్తుంది ఈ జావా.
Also Read: Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter