Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుంది

Gmail Shortcuts: ఇటీవలి కాలంలో జీమెయిల్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. దాదాపుగా అందరూ జీ మెయిల్ వాడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని జీ మెయిల్ షార్ట్‌కట్ కీల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాదు మీ పని మరింత సులభమౌతుంది. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 2, 2024, 12:10 PM IST
Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుంది

Gmail Shortcuts: జీ మెయిల్ షార్ట్‌కట్ కీల గురించి తెలుసుకుంటే గంటల సమయం పట్టే పని క్షణాల్లో పూర్తి కావచ్చు. మీ చేతి వేళ్లతో జీమెయిల్ మేనేజ్ చేయవచ్చు. వాస్తవానికి జీ మెయిల్ చాలా రకాల ఆప్షన్లు ఉంటాయి కానీ అందరికీ తెలియవు. ఈ ఆప్షన్లు తెలుసుకుని ఉపయోగించగలిగితే జీ మెయిల్ మరింత సౌకర్యవతంగా మారుతుంది. 

జీ మెయిల్ సెట్టింగుల్లో  మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు. స్నూజ్ చేయవచ్చు. ఈ ఫీచర్లను సరిగ్గా ఉపయోగించగలిగితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జీ మెయిల్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుందని చాలామందికి తెలియదు. ఏదైనా సీక్రెట్ ఉంటే సురక్షితంగా ఉంచి పంపించవచ్చు. ఏదైనా మెయిల్ పంపించేటప్పుడు మీకు దిగువున కన్పించే కీ లాక్ ఐకాన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడీ మెయిల్‌కు నిర్ధారిత సమయం ఫిక్స్ చేయవచ్చు. తద్వారా ఈ మెయిల్ చదవాలంటే రిసీవర్‌కు పాస్‌వర్డ్ అవసరమౌతుంది. దాంతోపాటు రిసీవర్ మీరు పంపించిన మెయిల్‌ను ఫార్వర్డ్ చేయకుండా, కాపీ చేయకుండా, ప్రింట్ చేయకుండా, డౌన్‌లోడ్ చేయకుండా మీరే సెట్ చేయవచ్చు. అంటే సమాచారం సురక్షితంగా ఉంచేందుకు మంచి పద్ధతి ఇది.

జీ మెయిల్‌లో అద్భుతమైన ఫీచర్

ఒక్కోసారి మెయిల్ టైప్ చేసిన తరువాత అప్పుడే పంపించకూడదని అనుకుంటే ఇందులో మంచి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మెయిల్‌ను తరువాత ఎప్పుడు పంపించాలనుకుంటున్నారా ఆ టైమ్ ఫిక్స్ చేయవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మెయిల్ టైప్ చేసి సెండ్ ఆప్షన్ వద్ద కన్పించే బాణంపై క్లిక్ చేసి షెడ్యూల్ ఎంపిక చేయాలి. తేదీ, సమయం ఫిక్స్ చేస్తే చాలు. ఆ సమయానికి మెయిల్ వెళ్తుంది.

జీ మెయిల్ సెర్చ్ బార్‌లో దాకున్న కొన్ని పదాల సహాయంతో చాలా సులభంగా మెయిల్స్ వెతకవచ్చు. జీమెయిల్‌ను మరింత వేగవంతం చేసేందుకు చాలా కీ బోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీ పని మరింత సులభమౌతుంది. 

Also read: Hurricane Beryl in Barbados: తుపానులో చిక్కుకున్న టీమ్ ఇండియా, ఇవాళైనా వస్తారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News