Morning Drinks: ముఖాన్ని కాంతివంతం చేసే మార్నింగ్‌ డ్రింక్స్‌.. అందమే కాదు ఆరోగ్యం కూడా..

Morning Drinks For Healthy Skin : కలబంద జ్యూస్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా పర్ఫెక్ట్‌ మార్నింగ్‌ డ్రింక్‌. దీంతో చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కలబంద జ్యూస్‌ కూడా తీసుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 3, 2024, 02:32 PM IST
Morning Drinks: ముఖాన్ని కాంతివంతం చేసే మార్నింగ్‌ డ్రింక్స్‌.. అందమే కాదు ఆరోగ్యం కూడా..

Morning Drinks For Healthy Skin : ఉదయం మనం తీసుకునే డ్రింక్స్ రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. దీంతో మీ స్కిన్‌ హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. మనం రోజూ 8 గంటలపాటు నిద్రపోతాం. కాబట్టి ఖనిజాలు గ్రహిస్తాయి. దీంతో స్కిన్‌ మెరుస్తూ కాంతివంతంగా మారుతుంది. ఆ మార్నింగ్‌ డ్రింక్స్‌ ఏంటో తెలుసుకుందాం.

గ్రీన్‌ టీ..
గ్రీన్‌ టీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖంపై మచ్చలు రాకుండా నివారిస్తుంది. ఇది మెటబాలిజం రేటును బలంగా మారుతుంది. గ్రీన్‌ టీలో కెటాచిన్స్‌ ఉంటాయి. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

లెమన్‌ వాటర్‌, తేనె..
నిమ్మరసం, తేనె గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల ఫంగల్‌ ఇన్పెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది. స్కిన్‌ సెల్‌ పెరగకుండా సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సీ, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో అదనపు నూనెను గ్రహిస్తుంది.

ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..

అల్లం, పసుపు..
అల్లం, పసుపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. ఇవి వయస్సు రీత్యా వచ్చే గీతలను కూడా తగ్గిస్తుంది. ముఖం పై మచ్చలు, గీతలు లేకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.

కలబంద జ్యూస్‌..
కలబంద జ్యూస్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా పర్ఫెక్ట్‌ మార్నింగ్‌ డ్రింక్‌. దీంతో చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కలబంద జ్యూస్‌ కూడా తీసుకోవాలి. దీంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ జ్యూస్‌లో విటమిన్‌ ఇ, సి, బి కూడా ఉంటుంది. కలబంద జ్యూస్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.

చియా సీడ్‌ నీళ్లు..
చియా సీడ్స్‌ కూడా మన చర్మాన్ని మెరిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. చియా సీడ్స్‌ నీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఇది ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. చియా సీడ్స్‌లో జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు హానికర యూవీ కిరణాల నుంచి డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది.

ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..

కొబ్బరి నీళ్లు..
కొబ్బరి నీటిని అప్పుడప్పుడు తాగుతారు. అయితే, ఇది కూడా మంచి మార్నింగ్‌ డ్రింక్‌. కొబ్బరి నీటిలో క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది డ్రై స్కిన్‌ సమస్యకు చెక్‌ పెడుతుంది. శరీరంలో నుంచి ఫ్రీ రాడికల్ సమస్యను అధిగమిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. కొబ్బరి నీళ్లు కొల్లాజెన్‌ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News