7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్

7th Pay Commission News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డబుల్ జాక్‌పాట్ రానుందా..? డీఏ పెంపుతోపాటు కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల డీఏను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
 

1 /9

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ జనవరిలో, రెండో డీఏ జూలై నెలలో ఉంటుంది.   

2 /9

మరికొద్ది రోజుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో డియర్‌నెస్ అలవెన్సులు, జీతాలు పెరగనున్నాయని ప్రచారం జరుగుతోంది.  

3 /9

కరోనా సయమంలో నిలిపివేసిన 18 నెలల బకాయిలను విడుదల చేయాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయీస్ జాయింట్ కన్సల్టేటివ్ బాడీ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.  

4 /9

ఈ ఏడాది జనవరిలో మొదటి డీఏ 4 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. జూలైలో కూడా నాలుగు శాతం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

5 /9

డీఏ నాలుగు శాతం పెంచితే.. ఒక ఉద్యోగి నెల జీతం రూ.50 వేలు అనుకుంటే.. నెలకు రూ.2 వేలు పెంపు ఉంటుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.  

6 /9

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 1.25 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.  

7 /9

18 నెలల డీఏ బకాయిలను కూడా కేంద్ర ప్రభుత్వ చెల్లిస్తే.. ఫస్ట్ క్లాస్ ఉద్యోగుల ఖాతాల్లో రూ.2 లక్షలకు పైగా డీఏ బకాయిలు జమ అవుతాయి.  

8 /9

AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ పెంపు ఉంటుంది. జనవరి నుంచి జూన్ వరకు డేటా ఆధారంగా జూలై నెల డీఏ పెంపు ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు డేటా ఆధారంగా జనవరి డీఏ పెంపు ఉంటుంది.  

9 /9

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.