Soaked Walnuts: వర్షాకాలం వ్యాధులతో జాగ్రత్త, రోజు గుప్పెడు వాల్‌నట్స్ తింటే అన్నింటికీ చెక్

Soaked Walnuts: వర్షాకాలం ప్రారంభమైపోయింది. సీజన్ మారడంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు ఇట్టే ప్రబలుతుంటాయి. ఇమ్యూనిటీ బలంగా లేకుంటే వ్యాదులు చుట్టుముడతాయి. అందుకే వర్షాకాలంలో డైట్ కూడా బాగుండాలి.

Soaked Walnuts: వర్షాకాలంలో వాల్‌నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదొక సూపర్‌ఫుడ్‌లా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. రోజూ ఉదయం గుప్పెడు వాల్‌నట్స్ తింటే అద్భుతమైన ఆరు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

1 /6

బరువు నియంత్రణకు వాల్‌నట్స్‌లో ఫైబర్ మోతాదు అధికంగా ఉంటుంది. దాంతో ఎక్కువసేపు ఆకలేయదు. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది.

2 /6

చర్మ, కేశాల సంరక్షణ వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ, కేశాల సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో చర్మ,, కేశ సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి. 

3 /6

ఎముకలు బలోపేతం వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల బలోపేతానికి కారణమౌతాయి. ఎముకల్లో నొప్పి, కీళ్ల నొప్పులు దూరమౌతాయి. వాల్‌నట్స్ సేవిస్తే అన్ని సమస్యలు దూరమౌతాయి

4 /6

మెదడు వికాసం వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజితం చేస్తాయి. వర్షాకాలంలో ఎక్కవగా అలసట, బద్ధకం ఉంటుంది. వాల్‌నట్స్ తినడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 /6

జీర్ణక్రియ మెరుగుదల వాల్‌నట్స్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో జీర్ణ సమస్య ఒకటి. 

6 /6

ఇమ్యూనిటీ బూస్ట్ వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్ట్ చేసేందుకు దోహదం చేస్తాయి. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తాయి.