Kalki 2898 AD: బాహుబలి సిరీస్ తర్వాత సరైన విజయం లేని ప్రభాస్.. గతేడాది ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని దాదాపు రూ. 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్, హిందీలో ఈ సినిమాలో మంచి వసూళ్లనే రాబట్టింది. అటు తెలంగాణ గడ్డపై ఈ సినిమా బ్రేక్ రూ. 65 కోట్లకు గాను రూ. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టి రూ. 15 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఇక హిందీలో ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ వసూల్లకు దగ్గర వెళుతుంది. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను అందుకున్నా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
కానీ ఈ సినిమా రాయలసీమ, ఏపీలో మిగిలిన ఏరియాల్లో కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోయింది. ముఖ్యంగా రాయలసీమ (సీడెడ్) లో ఈ సినిమాను దాదాపు రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు రూ. 7 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే రెండో వారం పూర్తి కావొస్తోన్న ఈ సినిమా అక్కడ రూ. 7 కోట్ల షేర్ రాబట్టడం అంత ఈజీ కాదు.
మరోవైపు ఏపీలో ఉన్న ఉత్తరాంధ్రలో రూ. 21 కోట్లకు గాను రూ. 20 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కు రూ. కోటి దూరంలో ఉంది. అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ. 14 కోట్లకు గాను రూ. 12 కోట్లు మాత్రమే రాబట్టింది. వెస్ట్ గోదావరిలో రూ. 10 కోట్లకు గాను రూ. 9 కోట్ల షేర్ రాబట్టి.. ఇంకా రూ. కోటి రూపాయల షేర్ కు అడుగు దూరంలో ఉంది. గుంటూరులో దాదాపు రూ. 12 కోట్ల బిజినెస్ కు కాను రూ. 10 కోట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణ, నెల్లూరు, గుంటూరులో దాదాపు రూ. కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల షేర్ రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. మొత్తంగా మూడో వీకెండ్ లో ఈ సినిమా ఆయా వసూళ్లను రాబడుతుందా అనేది చూడాలి.
మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమాను వైజయంతి మూవీస్ అడ్వాన్స్ రూపంలో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా దాదాపు అక్కడ 85 శాతం రికవరీ అయింది. అటు రాయలసీమలో మాత్రం 75 శాతం రివకరీ అయింది. మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నా .. ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం తిప్పలు పడుతోంది కల్కి మూవీ. మొన్న ఆదివారం రోజు రికార్డు బ్రేక్ వసూళ్లను రాబట్టిన కల్కి మూవీ సోమవారం నుంచి ఆక్యుపెన్షీ దాదాపు 80 శాతం పడిపోయింది. మళ్లీ వీకెండ్ వస్తే కానీ ఈ సినిమాకు ఆ రేంజ్ వసూల్లు దక్కవు. ఒక రకంగా 13, 14 వ తేదిల్లో వచ్చే వసూళ్లే ఈ సినిమాకు కీలకం అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ వీకెండ్ వసూళ్లతోనైనా.. ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 500 కోట్ల షేర్ (రూ. 950 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ. 1000 కోట్ల బెంచ్ మార్క్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook