Gajkesari Rajyog 2024: ఆషాడమాసంలో శక్తివంతమైన గజకేసరి యోగం.. ఈ 4 రాశులకు నెలంతా డబ్బే డబ్బు..


Ashadamasam: ఆషాడ మాసంలో కొన్ని గ్రహలు, ఒక రాశి నుంచి మరోక స్థానంకు మారుతున్నాయి. దీని  ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం కూడా కల్గుతుందని పండితులు చెబుతున్నారు.

1 /6

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో మంచి చేస్తాయి. దీని వల్ల ఆకస్మిక ధనలాభంతో పాటు, ఉద్యోగాలలో కూడా ప్రమోషన్ లు జరుగుతాయి. కొన్ని రాశులకు మంచి ప్రభావం ఉండగా, మరికొన్ని రాశులపై మధ్యస్థ ఫలితాలు కూడా ఉంటాయి. దీనిలో భాగంగా.. ఆషాడ మాసంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల వృషభం,కన్య, సింహం, మీనం రాశులకు ఊహించని విధంగా అద్భుత యోగాలు కల్గనున్నాయి.

2 /6

వృషభంరాశి.. ఈ రాశి వారికి గజకేసరి యోగం వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. ఆగిపోయిన పనులన్నిపూర్తవుతాయి. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. విదేశీయానానికి కూడా అవకాశం ఉంటుంది.

3 /6

కన్య రాశి.. ఈ రాశి వారికి ఆషాడ మాసమంతా కలసి వస్తుందని చెప్పుకోవచ్చు. తండ్రి తరపు నుంచి ఆస్తులు కలపి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తారు. కొత్త ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తారు. మీరు అనుకున్న పనులన్ని కూడా పూర్తి అయి విజయం సాధిస్తారు.

4 /6

సింహా రాశి.. ఈ రాశుల వారికి గజకేసరి యోగం వల్ల, ఆషాడ మాసంలో కూడా డబ్బులు వర్షంకురుస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లతో పాటు, అనుకోకుండా మంచిస్థానానికి చేరుకుంటారు.  మీ వల్ల  ఇంట్లో వారికి ఎన్నో రకాల లాభాలు కల్గుతాయి.

5 /6

మీనరాశి వారికి దగ్గరి సంబంధం వారితో పెళ్లి కుదురుతుంది.  రియల్ ఎస్టేట్ రంగంలో వీరు పెట్టిన పెట్టుబడి, డబుల్ ట్రిబుల్ అవుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు మంచి చేస్తారు. ఆషాడ మాసంలో వీరికి అఖండ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

6 /6

ఈ రాశుల వారు మరింతమంచి ఫలితాల కోపం.. ప్రతిరోజు రావిచెట్టు కింద నెయ్యి దీపారాధన చేయాలి. చీమలకు చక్కెర,బెల్లంను తినడానికి పెట్టాలి. అంతేకాకుండా.. పేదవారికి అన్నదానం, వస్త్రదానంచేస్తే ఇంకా మంచి ఫలితాలు కల్గుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)