Nabha Natesh: ‘డార్లింగ్’ మూవీతో నభా నటేష్ బ్యాక్ బౌన్స్ అయ్యేనా.. ? రీ ఎంట్రీ మూవీపై ఇస్మార్ట్ పోరి భారీ ఆశలు..

Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పుతుందా లేదా అనేది చూడాలి.

1 /5

నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. టాలీవుడ్ లో  రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది.  ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది.

2 /5

తెలుగులో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో వచ్చిన ఇమేజ్ తో   నభా నటేష్ టాలీవుడ్ లో  వరుస సినిమాలు చేసింది. ఇక  తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత ఈ భామ ఒక్క సినిమా చేయలేదు.

3 /5

అప్పట్లో నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైయింది. దీంతో సినిమాలకు దూరంగా ఉంది. ఇపుడు తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దాంతో పాటు  ‘స్వయంభూ’ సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

4 /5

నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ మూవీ విషయానికొస్తే..  ఈ సినిమాలో నభా.. స్పిట్ పర్సనాలిటీతో బాధ పడే అమ్మాయి పాత్రలో నటించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

5 /5

నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది.