Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ తో భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మన దేశంలో ఏకైక ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. ప్యాన్ ఇండియా కాకుండా.. ఫ్యాన్ ఇండియా ఏంటి అని అనుకుంటున్నారా..! బాహుబలి తో దేశ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 14, 2024, 12:33 PM IST
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ తో భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్..

Kalki 2898 AD: బాహుబలి సిరిస్ సినిమాల తర్వాత ‘సాహో’తో హిందీ బెల్ట్ లో సత్తా చాటాడు. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ తో ప్రభాస్ పని అయిపోయిందన్న వాళ్లు ఉన్నారు. కేవలం రాజమౌళి వల్లే ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అది కేవలం గాలి బుడగే అన్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో అందరి వేళ్లు ప్రభాస్ వైపు చూపించారు.

కానీ సింహం మూడడుగుల అడుగులు వెనక్కి వేస్తే..ఆరుడుగు వేగంతో దూకుతున్నట్టు .. గతేడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 ది సీజ్ ఫైర్’ తో హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చాటాడు. మొత్తంగా మన దేశంలో వరుసగా తన సినిమాలు ఫ్లాపైనా.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న ఏకైక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్ వంటి స్టార్స్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో ప్యాన్ ఇండియా స్టార్స్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభాస్ మాత్రం భారతీయ బాక్సాఫీస్ ను కంటిన్యూగా తన సినిమాలతో రూల్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మరో బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో రెండో రూ. 1000 కోట్ల సినిమాగా ప్రభాస్ మరో రికార్డు క్రియేట్ చేసాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. మొత్తంగా వెయ్యికోట్లకు వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఏడో చిత్రంగా నిలిచింది. మొత్తంగా కల్కి సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలే నెలకున్నాయి.

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News