IAS Smita Sabharwal tweet on reservation quota: దేశంలో గత కొన్నిరోజులుగా సివిల్స్ సర్వీసెస్ అధికారులు ఎక్కువగా వివాదాల్లో ఉంటున్నారు. ఇటీవల పూజా ఖేద్కర్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి.. సివిల్స్ సర్వీసెస్ లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనీగా ఉన్న క్రమంలో.. పూణెలో.. ప్రత్యేక క్యాబిన్ డిమాండ్ చేయడం, కొన్ని వసతులు కావాలంటూ పట్టుబట్టడంతో ఆమె వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఏకంగా కలెక్టర్ ఛాంబర్ ను ఉపయోగించుకున్నారు. తన నెమ్ ప్లేట్ ను సైతం పెట్టుకుని అక్కడివారిని షాక్ కు గురిచేశారు. వెంటనే దీనిపై కలెక్టర్, సీఎస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను మహరాష్ట్ర సర్కారు.. వెంటనే వాషీమ్ జిల్లాకు బదిలీచేశారు.
Disturbing news on the fake certificates being used by unscrupulous candidates to gain entry into the civil services.
#UPSC and the #IAS/IPS is still regarded by bright students as the last bastion, where merit will see them through.Implore the authorities to conduct…
— Smita Sabharwal (@SmitaSabharwal) July 15, 2024
ఈ నేపథ్యంలో పూజా.. నకిలీ వైకల్యం, ఓబీసీ సర్టిఫికేట్ ల వివాదం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను సైతం ఏర్పాటుచేసింది. అదే విధంగా పూజ తల్లి కూడా పేదల భూములను అక్రమంగా కబ్జా చేసుకున్న ఘటన కూడా వార్తలలో నిలిచింది. పూజ తల్లిదండ్రులు ప్రస్తుతం అబ్ స్కాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు..2011 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ సైతం.. గత ఏడాది రాజీనామా చేసి, నటుడిగా మారారు. ఆయన కూడా యూపీఎస్సీలో.. రిజర్వేషన్ కోటాలో జాబ్ పొందేందుకు.. లోకోమోటర్ వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్లను జతపర్చారు. తాజగా, ఆయకు చెందిన అనేక డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తి ఎలా డ్యాన్స్ చేస్తారంటూ కూడా ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..
దీంతో ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్ లో రిజర్వేషన్ల అంశం మాత్రం చర్చలో నిలిచింది. దీనిపై సమగ్రంగా చర్చజరగాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. ప్రస్తుతం దేశంలో సివిల్స్ సర్వీసెస్ అధికారుల వివాదం వేళ.. స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ ప్రస్తుతం ఆసక్తికరంగ మారింది. దేశంలో ప్రస్తుతం రిజర్వేషన్లు, కోటాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్మితా సబర్వాల్ ట్విట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి