Xiaomi Mix Fold 4: 50MP కెమేరా, 16GB Ram అద్దిరిపోయే ఫీచర్లతో షియోమీ ఫోల్డెడ్ ఫోన్ వచ్చేసింది

Xiaomi Mix Fold 4: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త ఫోల్డెడ్ ఫోన్ లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్ ఇంకా అద్దిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన Xiaomi Mix Fold 4 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2024, 03:47 PM IST
Xiaomi Mix Fold 4: 50MP కెమేరా, 16GB Ram అద్దిరిపోయే ఫీచర్లతో షియోమీ ఫోల్డెడ్ ఫోన్ వచ్చేసింది

Xiaomi Mix Fold 4: Xiaomi స్మార్ట్ ఫోన్ గురించి అందరికీ తెలిసిందే. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీకు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. షియోమీ పేరుతోనే కాకుండా ఇంకా ఇతర పేర్లతో కూడా మార్కెట్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడు షియోమీ కొత్తగా ఫోల్డెడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే Xiaomi Mix Fold 4 .

Xiaomi Mix Fold 4 లో 7.98 అంగుళాల ప్రైమరీ 2కే ఎమోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఉండటంలో రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6.56 ఇంచెస్ ఎమోల్డ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులోని రెండు స్క్రీన్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్భీ విజన్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. Xiaomi Mix Fold 4 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 SoCతో పనిచేస్తుది. ఇందులో 16జీబీ వరకూ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ శాటిలైట్ కమ్యూనికేషన్కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 67 వాట్స్ ఛార్జింగ్ తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై 7, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ ఎక్స్8 రేటింగ్ కలిగి ఉంది. 

Xiaomi Mix Fold 4  లైకా బ్రాండెడ్ బ్యాక్ కెమేరాతో వస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 50 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్, 5ఎక్స్ ఆప్టిక్ జూమ్, 10 మెగాపిక్సెల్ టెలీఫోటో, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యమౌతోంది. 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1 లక్షా 3 వేలుంటుంది. 16 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1 లక్షా 15 వేలుంటుంది. ఇందులోనే హై ఎండ్ 16 జీబీ ర్యామ్-1 టీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1 లక్షా 26 వేలుంటుంది. ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. 

Also read: DA Arrears: ఉద్యోగులకు బంప్ ఆఫర్, డీఏ బకాయిలపై బడ్జెట్ లో ప్రకటన, పెద్ద మొత్తంలో డబ్బులు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News