Mr. Bachchan Update: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో మాస్ మహారాజా రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమానిగా, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేయగా, టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మరొకసారి రవితేజ మాయ చేయబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఇంకా ఒక పాట పెండింగ్లో ఉందట. అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాలలో ఈ పాట చిత్రీకరణ జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఇంకొక వైపు పాట షూటింగ్ పెండింగ్ ఉంది.. మరి ఉన్నది 15 రోజులే ఇంత తక్కువ సమయంలో ఎలా షూటింగు పూర్తి చేసి సినిమాను తెరకెక్కిస్తారు అనే సందేహాలు అభిమానులలో తలెత్తుతున్నాయి. మరి హరీష్ శంకర్ ఏ మాయ చేసి సినిమాని విడుదలకు సిద్ధం చేస్తారో చూడాలి. మొత్తానికైతే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..
హిందీ మూవీ రైడ్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈయన తన మాటలతో అందరి తీరును ఆకర్షిస్తున్నారు. సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
రవితేజ సినిమాల విషయానికి వస్తే, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ఆ తర్వాత సెకండ్ హీరోగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ప్రస్తుతం మాస్ మహారాజాగా పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన వయసు 54 .. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా రవితేజ దూకుడుకి ఎలాంటి వారైనా సరే వెనక్కి తగ్గాల్సిందే.
Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్ రెడ్డి అసంతృప్తి
Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Mr. Bachchan: ఇంకా షూటింగ్ పెండింగ్.. ఆలోపు పూర్తి చేస్తారా..?