Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన  అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు  తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి  తరుపున ప్రత్యేక  లేఖ రాసారు. ఈ లేఖలో తెలుగు సినీ పరిశ్రమలో ఎదుర్కొటున్న సమస్యలతో పాటు గద్దర్ అవార్స్ విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు.    

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 31, 2024, 08:21 PM IST
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..

Revanth Reddy:  తెలంగాణ రాష్ట్రంలో  సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోన్న గౌరవ ముఖ్యమంతి శ్రీ ఏ. రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితో పాటు తెలుగు చలన చిత్ర వాణిజ్య తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ విడుదల చేశారు. త్వరలో  ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకొని..ఫిలిం ఇండస్ట్రీ కి ఎదుర్కొంటున్న పలు విషయముల గురించి ఆయనతో చర్చిస్తామన్నారు.

అంతేకాదు ఎన్నో యేళ్లుగా పెండింగ్ లో వున్న అవార్డ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి " గద్దర్ అవార్డ్స్ " పేరు మీద ఇక నుండి ప్రతి యేడాది  అవార్డ్స్  ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.  
ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందన్నారు.  

దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా అవార్డుల విషయంలో సదరు విధి విధానాలను  తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి త్వరలో అందజేస్తామన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..
గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన  నటునిగా, కళాకారులుగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్ గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉందిని కొనియాడారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News