Delhi Rains: దేశ రాజధాని ఢిల్లిలో వర్ష బీభత్సం .. గంట సేపట్లోనే మహా ప్రళయం..

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లిని వరుణుడు వణికించాడు. గంట సేపట్లో కుండపోత వర్షంతో నగర ప్రజలు విల విల లాడిపోయారు. అంతేకాదు ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో వర్ష బీభత్సం నేషనల్ క్యాపిటల్ రీజయన్ని గడగడలాడించింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 1, 2024, 07:53 AM IST
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లిలో వర్ష బీభత్సం .. గంట సేపట్లోనే మహా ప్రళయం..

Delhi Rains: దేశ వ్యాప్తంగా ఉత్తారాది, దక్షిణాది అనే తేడా లేకుండా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ లో వర్ష బీభత్సానికీ వందలాది మంది ప్రాణాలు విడిచారు. అక్కడ పరిస్థితులను కేంద్రానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అటు ఆర్ఎస్ఎస్ తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా  వర్ష బీభత్సానికి అతలాకుతలమైన ప్రాంతాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఆ సంఘటన మరవకు ముందే.. దేశ రాజధానిపై వరుణుడు పగపట్టినట్టు వర్ష బీభత్సం సృష్టించాడు. ఒక గంటలోనే 11 సెంటీమీటర్ల వర్షంతో అక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

ఈ రోజు కూడా దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతేనే ఢిల్లీ వాసులు బయటకు రావాలని సూచించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం.

నిన్న సాయంత్రంతో పాటు రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  భారీ వర్షంతో లూటియన్స్ ఢిల్లీ,కాశ్మీర్‌ గేట్, ఓల్డ్‌ రాజేంద్రనగర్‌తో సహా పలు ప్రాంతాలు  పీకలోతు నీళ్లలో మునిగిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం కారణంగా ఢిల్లీని ఓ పురాతర భవనం కూలింది. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. మరో చోట చెట్టు కూలి వాహనం దెబ్బతింది. ఇక ఢిల్లీకి రావాల్సిన విమానాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించినట్లు సమాచారం. రావూస్‌ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజేందర్‌నగర్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సివిల్స్‌ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజేంద్రనగర్‌ ప్రాంతం మరోసారి వరదనీటిలో  మునిగిపోయింది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News