Happy birthday Mrunal Thakur: ఎన్నో అడ్డంకులు దాటి మరి సక్సెస్ అందుకున్న మృణాల్.. నిర్మాతలతో సైతం గొడవ!

Mrunal Thakur: సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తరువాత విరుదలైన రెండవ చిత్రం హాయ్ నాన్న కూడా ఈ హీరోయిన్ కి మంచి విజయం అందించింది. ఈ ముద్దు గుమ్మ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా.. ఈ హీరోయిన్ గురించి మరిన్ని వివరాలు మీకోసం..

1 /6

సీరియ‌ల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ ఠాకూర్. అయితే తన మొదటి సీరియల్ తనకు ఎటువంటి పేరు తెచ్చి పెట్టలేదు. ఆ తరువాత కూడా.. ఈ నటి పెద్దగా బాగోలేదంటూ.. అవకాశాలు సైతం రాలేదు. ఓ ఇండోనేషియా టీవీ షోలో కూడా నా తెచ్చింది మృణాల్.

2 /6

కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు తెచ్చుకుంది. ఈ నటి అంతగా బాగా లేదంటూ.. నటన కూడా అంత రాదు అంటూ కామెంట్లో వినిపించాయి. కానీ ఈ అడ్డంకులన్నీ దాటుకొని ప్ర‌స్తుతం.. టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. 

3 /6

సూపర్ 30, జెర్సీ లాంటి హిందీ సినిమాల్లో.. నటించిన మృణాల్.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలో సీతగా కనిపించి అందరిని మాయ చేసింది.. ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఈ హీరోయిన్ కి పెద్ద సక్సెస్ అంటిందించింది. 

4 /6

ఆ తరువాత హాయ్ నాన్న.. చిత్రంతో మరో విజయం అందుకుంది ఈ హీరోయిన్. ఆ తరువాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కనిపించింది. ఈరోజు ఈ హీరోయిన్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్తడే విషెస్ తెలుపుతున్నారు. 

5 /6

తాజాగా మృణాల్ ఠాకూర్ తన గురించి ఒక విషయాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆ విషయం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా విడుదల కాలేదు. 

6 /6

ఈ చిత్రం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘న పూజ మేరీ జాన్ లో అవకాశం వచ్చినప్పుడు.. ఆ సినిమాలో క్యారెక్టర్ నా జీవితానికి దగ్గరగా ఉంది అని అనిపించింది.దాంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. కానీ మమ అన్ని స్క్రీన్ టెస్ట్ లు పూర్తి చేశాక.. నన్ను తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నారనే టాక్ వినిపించడంతో నిర్మాత దగ్గరికి పోయి మరి గొడవపడ్డా. ఒక రకంగా ఈ పాత్ర కోసం చాలా ఫైట్ చేశాను’అంటూ చెప్పుకొచ్చింది.