Dear Nanna OTT Update: ట్యాలెంటెడ్ యువ నటుడు చైతన్య రావ్, యష్ణ చౌదరి హీరో, హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, మధునందన్, సంధ్య జనక్, శశాంక్, సుప్రజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది. హ్యూస్టన్ అంతర్జాతీ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న.
చెఫ్ కావాలని కలులు కనే హీరో (చైతన్య రావ్) తన లైఫ్ లో ఎలాంటి సంఘటలను ఫేస్ చేసాడు. ఈ సందర్భంగా తన తండ్రితో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. మొత్తంగా కొత్త దర్శకుడు అంజి సలాది ప్రేక్షకులను మదిని పిండే విధంగా ఈ సినిమాను ఎఫెక్టివ్ గా తెరకెక్కించాడు. . కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించిన విధానం ఆకట్టుకుంది.
తండ్రీ కొడుకులు ఎమోషన్స్ ఎమోషన్ లో ఇందులో ఆకట్టుకునే అంశం. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈ చిత్రంలో ఈ ఇతర ముఖ్యపాత్రల్లో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్ ఇతర కీలక పాత్రలు పోషిచారు. అనిత్ కుమార్ మాధాడి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్ గా వ్యవహరించారు. ఆహాలో చూడని ప్రేక్షకులు ఈ సినిమాను ఈటీవీ విన్ లో చూడొచ్చు.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter