Allu Arvind – Allu Ayaan: మ‌న‌వ‌డితో క్రికెట్ ఆడుతున్న అల్లు అర‌వింద్.. వీడియో వైరల్..

Allu Arvind and ayaan: టాలీవుడ్ ఫెమస్ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడితో కలిసి క్రికెట్ ఆడుతూ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 12, 2024, 01:58 PM IST
  • మనవడితో అల్లుఅరవింద్ క్రికెట్..
  • ఇప్పటి నుంచి ట్రైనింగా..అంటూ ఫ్యాన్స్ కామెంట్లు..
Allu Arvind – Allu Ayaan: మ‌న‌వ‌డితో క్రికెట్ ఆడుతున్న అల్లు అర‌వింద్.. వీడియో వైరల్..

Allu aravind and allu arjun son allu ayaan playing cricket video: సాధారణంగా సినిమా రంగంలో ఉన్న వారు బిజీగా లైఫ్ గడిపేస్తుంటారు. ప్రతిరోజు షూటింగ్ లని, తమ కుటుంబాలకు ఎంతో దూరంగా ఉంటాయి. తాము చేసే పనిలో బిజీగా ఉన్న కూడా కొన్నిసార్లు తమ వాళ్లతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. అందుకే చాలా మంది ఏమాత్రం సమయందొరికిన తమ వాళ్లలో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్ తన మనవడితో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

 

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డి ల ముద్దుల కొడుకుకు చెందిన ఒక వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అల్లు స్నేహ రెడ్డి తరచుగా.. అయాన్, అర్హల ఫోటోలు, పిల్లలు అల్లరీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం (ఆగస్టు 11) కావడంతో , అల్లు అరవింద్, తన గారాల మనవడు.. అయాన్ కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. అల్లు అరవింత్ బౌలింగ్ చేస్తుంటే.. అయాన్ తన దైన్ స్టైల్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. తాత.. మనవళ్లు ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఫుల్ జోష్ గా గడిపేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ వీడియోను స్నేహరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయాన్.. చిన్నప్పటి నుంచి కూడా అల్లరి చేస్తు ఫన్నీగా ఉంటాడు. చాలా మంది బన్ని అభిమానులు.. అయాన్ ను ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ వీడియోను చూసిన అల్లు అభిమానులు, వావ్.. తాత మన వళ్లు భలే ఎంజాయ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు తాత.. బౌలింగ్ లో.. మనవడు భలే ఆడుతున్నాడే.. అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. ఇంకేం.. భారత్ తరపున ఫ్యూచర్ క్రికెట్ లో సత్తా చాటేలా..అయాన్ ను తయారు చేస్తున్నారా.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Read more: Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..  

ఇదిలా ఉండగా.. అల్లు అర‌వింద్ ప్ర‌స్తుతం నాగ చైతన్య‌తో ‘తండేల్’ అనే మూవీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి కథానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. నాగచైతన్యగా హీరోగా నటిస్తున్నారు.  కార్తికేయ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుందంట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News