Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

Pune airport runway: పూణె ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూడు ముంగీసలు ఒక పాము మీద దాడికి తెగబడ్డాయి. దీంతో నువ్వా.. నేనా అన్న విధంగా ఫైటింగ్ జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 12, 2024, 12:48 PM IST
  • రన్ వే మీద షాకింగ్ ఘటన..
  • పాముపై దాడికి దిగిన ముంగీసలు..
Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

3 Mongoose attack on snake at bihar patna airport video goes viral: సాధారణంగా పాములకు కొన్ని జంతువులకు అస్సలు పడదు. వీటిని పాములు బద్దశత్రువులుగా భావిస్తాయి. ముఖ్యంగా ముంగీసలు, గద్దలను చూస్తేనే పాములు భయంతో పారిపోతాయి. కానీ కొన్నిసార్లు వీటి నుంచి పాములు ఈజీగా తప్పించుకుంటాయి. కొన్నిసార్లు ముంగీసలు పాముపై పై చేయిసాధిస్తే, మరికొన్ని పాములు కూడా.. ముంగీసలకు చుక్కలు చూపిస్తాయి. ఈ నేపథ్యంలో పాములు అడవిలో ఎంతో జాగ్రత్తగా ఉంటాయంట. ముంగీసలు, గద్దలు వంటి జంతువులకంట్లో పడకుండా.. ఉంటాయంట. కానీ కొన్నిసార్లు.. అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. ముంగీసలకు పాములంటే ఎంతొ ఇష్టమంట. వీటిని వేటాడటానికి తెగ ఆసక్తి చూపిస్తాయంట.

Add Zee News as a Preferred Source

 

అంతేకాకుండా.. పాముల  శరీరం నుంచి ఒకరకమైన వాసనను, ముంగీసలు ఇట్టే పట్టేస్తాయంట. అందుకు పాములు ఎంత జాగ్రత్తగా ఉన్న.. ముంగీసలు ఇట్టే పట్టేస్తుంటాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో పాములకు చెందిన అనేక వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని చూస్తే షాకింగ్ కు గురిచేసేవిగాను, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఈ క్రమంలో.. పాముల వీడియోలను చూడటానికి నెటిజన్ లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూణెరన్ వే మీద జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 

పూర్తివివరాలు..

పూణె ఎయిర్ పోర్టులో అరుదైన ఘటన సంభవించింది.  ఎయిర్ పోర్టు రన్ వే మీదకు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒకపాము ప్రత్యక్షమైంది. అది తనమానాన .. తాను పోతుంది. ఇంతలో ఆ పామును ముంగీస గ్యాంగ్ చూశాయి. ఇంకేముంది... అటాక్.. అన్నట్లు పాము మీదకు యుద్ధం ప్రకటించాయి. ముందు ఒక ముంగీస వెళ్లి పాముతో యుద్దం చేసింది.  అంతేకాకుండా.. పామును తలను కోరికి దాన్ని ఎరగా చేసేద్దామని తెగ ట్రైచేస్తుంది. మరోవైపు.. పాము కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. ముంగీసకు చుక్కలు చూపించింది.

ముంగీస ఎంతో గాల్లో ఎగిరి దాడికి ప్రయత్నించిన కూడా.. పాము తప్పించుకుంది. దీంతో ఇక ముంగీస అలిసి పోయి.. తన ఫ్రెండ్స్ కు హిండ్ ఇచ్చింది. దీంతో మెల్లగా మరో రెండు ముంగీసలు కూడా పాముపైకి దాడి చేయడానికి అక్కడికి వచ్చాయి. అయిన కూడా పాము..  ఏమాత్రం బెదరక.. మూడింటితోను ఫైటింగ్ చేసింది. ఈ వీడియోను దూరం నుంచి కొందరు సిబ్బంది తమ ఫోన్ లలో రికార్డు చేసి, ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read more: Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. వామ్మో.. పాముకు భలే డేర్ ఉందిగా.. అంటూ కొందరు, మరికొందరు ముంగీసలను పాము ఓడించిందా.. చివరకు ఏమైంది..అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News