Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..

IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మరోసారి స్మితా వ్యాఖ్యల వ్యవహారం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 12, 2024, 06:08 PM IST
  • స్మితా సబర్వాల్ కు బిగ్ ట్విస్ట్..
  • హైకోర్టులో పిటిషన్..
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్  వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..

Petition filed agaist ias smita Sabharwal in Telangana high court: సీనియర్ ఐఏఎస్ అధికారిని, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ గతంలో దివ్యాంగుల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన  విషయం తెలిసిందే. దీనిపై వికలాంగుల సమాజం తీవ్రంగా స్పందించింది. వెంటనే స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుని, బహిరంగా క్షమాపణ చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపైన హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో వికలాంగుల సంఘానికి చెందిన నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. అనేక నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు.

కొన్నిరోజుల క్రితం స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా.. సివిల్స్ ఎగ్జామ్స్ లలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. దీనిపై స్మితా సబర్వాల్ ను కొందరు తిట్టిపోయగా.. మరికొందరు ఆమెను సపోర్ట్ చేశారు. మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది.  కొంత మంది మేధావులు సైతం స్మితా వ్యాఖ్యల్ని ఖండించారు.  ఇదిలా ఉండగా దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన స్టేట్ మెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. వెంటనే స్మితాపై చర్యలు తీసుకునేలా.. యూపీఎస్సీ ఛైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సవాలు చేసేందుకు పిటిషనర్‌కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించింది. అయితే... పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీంతో.. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మితా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Read more: world elephants day 2024:   వాళ్లంతా రియల్ హీరోస్.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో ఎక్స్ లో స్పందించిన డిప్యూటీ సీఎం..  

స్మితా సబర్వాల్ ఎక్స్ లొ పోస్టు పెట్టి.. వైకల్యం ఉన్న సర్జన్ ను ప్రజలు విశ్వసిస్తారా?.. వైకల్యం ఉన్న వాళ్లను పైలట్ గా నియమించుకుంటారా..అని ప్రశ్నించారు. యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఓఎస్ లు ఫీల్డ్ లకు వెళ్లి, ప్రజలకు ఏయే ఫలాలు వస్తున్నాయో.. అనే దానిపై దగ్గర నుంచి తెలుసుకొవాల్సి ఉంటుంది. ఇలాంటి పోస్టులలో దివ్యాంగులు ఉంటే.. ఆ పోస్టుకు ఎంతవరకు న్యాయం చేస్తారని కూడా స్మితా వ్యాఖ్యలు చేశారు. అందుకే దీనికి రిజర్వేషన్ లు అవసరమా.. అంటూ ట్విట్ చేశారు.దీనిపై చాలా మంది స్మితా వ్యాఖ్యల్ని పూర్తిగా తప్పుబట్టారు. ఒక ఉన్నత స్థానంలో ఉండి, ఇంత సంకుచితంగా ఆలోచించడం కరెక్ట్ కాదని కూడా ఆమె ట్విట్ కు కౌంటర్ లు కూడా ఇచ్చారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News