Kolkata Doctor Rape & Murder Case: కోల్‌కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమవుతోంది. ఈ కేసులో కీలకమైన క్లూ ఒకటి వెలుగు చూసింది. సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన ఈ క్లూ కేసును కీలక మలుపు తిప్పవచ్చని భావిస్తున్నారు. బాధితురాలి చివరి క్షణాల గురించిన క్లూ ఇది. అసలు ఏమైందంటే..
కోల్‌కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐకు ముఖ్యమైన సమాచారం చేజిక్కింది. సంఘటన జరిగిన రోజు అంటే ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 2.45 గంటల వరకూ బాధితురాలు జీవించే ఉన్నట్టుగా తెలుస్తోంది. సీబీఐ వద్ద ఉన్న టెక్నికల్ డేటా ఇందుకు సాక్ష్యం. సీబీఐ ప్రకారం తెల్లవారుజామున 2.45 గంటలకు బాధితురాలి బంధువు పంపిన ఓ సందేశానికి ఆమె సమాధానం ఇచ్చింది. బాధితురాలి బందువుకు బాధితురాలి ఫోన్ నుంచి ఉదయం 2.45 గంటలకు సమాధానం వెళ్లింది. ఇదే బాధితురాలికి సంబంధించి చివరి మెస్సేజ్. ఇది కీలకమైన క్లూగా దర్యాప్తు ఏజెన్సీ పరిగణిస్తోంది. బాధితురాలి చివరి క్షణాల సమాచారం తెలుపుతుంది.
అయితే ఈ మెస్సేజ్‌ను బాధితురాలే పంపిందా లేక ఆమె ఫోన్ మరెవరైనా వినియోగించారా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్లూ ఆధారంగా తదుపరి విచారణ కొనసాగించనుంది సీబీఐ.
ఆగస్టు 9న ఏం జరిగింది Minute to Minute Report
హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ మృతదేహాన్నిఆగస్టు 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు పీజీటీ వైద్యుడొకరు చూశారు. ఇదే విషయాన్ని ఫస్ట్ జనరల్ డైరీ 542లో తాలా పోలీస్ స్టేషన్లో ఉదయం 10.10 గంటలకు నమోదు చేశారు. ఆ తరువాత 10.30 గంటల వరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సెమినార్ హాలును సీజ్ చేశారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ బృందం, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ బృందాలు 11 నుంచి 11.30 గంటల మధ్యలో చేరుకున్నారు. అదే రోజు 10.52 గంటలకు ఓ పోలీసు అధికారి బాధితురాలి కుటుంబానికి సమాచారం చేరవేశారు.
బాధితురాలు మరణించినట్టుగా మద్యాహ్నం 12.44 గంటలకు ప్రకటించారు. పోస్ట్ మార్టమ్ తరువాత మద్యాహ్నం 1.47 గంటలకు మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అదే రోజు మద్యాహ్నం 3.40 గంటలకు ఆర్ జి కర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ ఓ సీక్రెట్ లేఖను తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్కు అందించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం కన్పించినట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేఖలో కోరారు.
ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అర్ధ నగ్న స్థితిలో అపస్మారకంగా ఉన్న మహిళను గుర్తించినట్టుగా పోలీసు అధికారి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ నివేదికలో ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలున్నాయని ఉంది. ఆగస్టు 8వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also read: September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook