అసలు ఉన్నట్టుండి ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు గాయం అయిందని చెప్పడం... అతడ్ని స్వదేశానికి పంపుతున్నామని టీమిండియా మేనేజ్ మెంట్ ప్రకటించడం..దీన్ని బీసీసీఐ కన్ఫామ్ చేయడం చాలా మందిలో సందేహాలు రేకెత్తించింది. ఇదే తరహా అనుమానాన్ని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా జట్టు మేనేజ్ మెంట్ కు ఓ సూటి ప్రశ్న సంధించాడు.
మురళీ కార్తీక్ మాట్లాడుతూ తీవ్ర గాయంతో నడవలేకపోతున్న విజయశంకర్ ను వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించాల్సి వస్తుందని టీం మేనేజ్ మెంట్ చెబుతోంది..పైగా దీన్ని బీసీబీఐ కూడా కన్ఫామ్ చేసింది. ఇదే నిజమైతే అడుగుతీసి అడుగేయలేకపోతున్న విజయ్ శంకర్ ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ కూల్ డ్రింక్స్ తో మైదానంలోకి ఎలా వచ్చాడు? అంటూ మాజీ క్రికెటర్ మురళీకార్తీక్ ప్రశ్నించారు. ఈ సందేహం నా ఒక్కడికేనా... లేక ఇంకెవ్వరికైనా వచ్చిందా?" అంటూ మురళీకార్తీక్ ట్వీట్ చేశాడు.
If Vijay Shankar has a toe niggle and that's the reason not to play why is he running drinks.. No one else there to do that job.. 🤫.. #CWC19
— Kartik Murali (@kartikmurali) June 30, 2019
ఇదిలా ఉండగా మురళీ కార్తీక్ కు వచ్చిన అనుమానమే చాలా మంది క్రికెట్ అభిమానులకు వచ్చింది. విజయ్ శంకర్ ను తప్పించిన విషయంలో అనేక మంది నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే విజయ్ శంకర్ ను గాయం పేరుతో స్వదేశానికి తిప్పిపంపారని సోషల్ మీడియాలో వేదికగా బీసీసీఐపై నెటిజన్లు ఆరోపిస్తున్నారు.