Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..

Balakrishna@50Years: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి నటుడిగా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో ఫస్ట్ నట వారసుడిగా సత్తా చూపెట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో 50 యేళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న ఫస్ట్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈయన 50 యేళ్ల కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

1 /12

బాలయ్య టాప్ మూవీస్.. మొత్తంగా బాలయ్య కెరీర్ లో ఇవే కాకుండా టాప్ చిత్రాలు చాలానే ఉన్నాయి. ముద్దుల కృష్ణయ్య, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, బంగారు బుల్లోడు, ముద్దుల మేనల్లుడు, లక్ష్మీ నరసింహా, శ్రీరామరాజ్యం, గౌతమి పుత్రశాతకర్ణి, జై సింహా, భగవంత్ కేసరి వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి.

2 /12

తాతమ్మ కల.. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తాతమ్మ కల’. నటుడిగా బాలయ్య  తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో తాతమ్మ కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో తొలి సినిమాలో అద్భుత నటనను కనబరిచాడు.

3 /12

మంగమ్మ గారి మనవడు.. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. ఈ  సినిమాతో బాలయ్య తొలి సోలో హిట్ గా నిలిచింది. అంతేకాదు తొలి బ్లాక్ బస్టర్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

4 /12

ముద్దుల మావయ్య.. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముద్దుల మావయ్య’. తెలుగులో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

5 /12

ఆదిత్య 369.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘ఆదిత్య 369’. అంతేకాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీగా ఈ చిత్రం రికార్డులకు ఎక్కింది.

6 /12

రౌడీ ఇన్ స్పెక్టర్.. బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. తెలుగులో పోలీస్ బ్యాక్ డ్రాప్  చిత్రాల్లో ఈ సినిమాకు తప్పక స్థానం ఉంటుంది.

7 /12

భైరవ ద్వీపం.. జానపదాలు కనుమరుగు అవుతున్న  సందర్బంలో బాలయ్య రాకుమారుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘భైరవ ద్వీపం’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఢిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. 

8 /12

సమరసింహా రెడ్డి.. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ చిత్రాల్లో  ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది.

9 /12

నరసింహనాయుడు.. నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘నరసింహనాయుడు’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా  నిలిచింది.

10 /12

సింహా.. బాలకృష్ణ,  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ  ‘సింహా’. ఈ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన చేసాడు.

11 /12

లెజెండ్.. బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం టాలీవుడ్  చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

12 /12

అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.