Kaaveri Movie: డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ‘కావేరి’ మూవీ..

Kaaveri Success Meet: తెలుగులో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘కావేరి’. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2024, 01:25 PM IST
Kaaveri Movie: డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ‘కావేరి’ మూవీ..

Kaaveri Success Meet:రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘కావేరి’. స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు ఈ చిత్రాన్ని నిర్మించారు.  రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించారు. ఆగస్టు 30న థియేట్రికల్ గా విడుదలైన  ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది.  ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర  బృందం. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబకషు మాట్లాడుతూ..
ఆగస్టు 30న విడుదలైన మా కావేరి మూవీకి ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. ఇది మంచి ఎమోషనల్ మరియు ఇన్స్పిరేషనల్ మూవీ. ఇటువంటి చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందగా గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలని చూపించిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు.  ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వెనక దర్శకులు రాజేష్ నెల్లూరు ఉన్నారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ  సినిమాను తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో రిషిత, ఫైజల్ తో పాటు మిగతా నటీనటులంతా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఎమోషన్ ఇంత బాగా క్యారీ అవడానికి కారణం రాజ్ కిరణ్ సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.  ఆయన అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ..

" ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి  మా కెమెరామ్యాన్ నాగేంద్ర బన్నీ కారణమన్నారు.ఆయన సపోర్ట్ తో ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చిందన్నారు.  ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ  పేరుపేరునా ధన్యవాదాలు. లో బడ్జెట్ లో మంచి సినిమా చేయగలమని ప్రూవ్ చేసిన చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలై దూసుకుపోతుందన్నారు. చూసిన వాళ్లు ఈ మూవీ బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

హీరో ఫైజల్ మాట్లాడుతూ..

"ముందుగా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ మీడియా లేకపోతే సినిమా ఇంత దూరం వచ్చేది కాదన్నారు. . ఈ సినిమా విషయంలో ముందుగా నేను మా దర్శకుడు రాజేష్ నెల్లూరు గారికి, నిర్మాత షేక్ అల్లాబకషు కు  థాంక్స్ చెప్పుకోవాలి. వీరిద్దరూ లేకపోతే.. ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదన్నారు. అంతేకాదు ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి హ్యాపీగా ఉందన్నారు.

డైరెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ(గెస్ట్) మాట్లాడుతూ.

స్యాబ్(SAB) అంటే షేక్ అల్లాబకషు. తన పేరునే బ్యానర్ గా పెట్టి, వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు. ముందుగా 'చెన్నై బజార్' మొదలుపెట్టి, ఆ తర్వాత 'కావేరి' చేసి, ఇప్పుడు 'మాస్ గాడు' చేస్తున్నారు. ఆడవారికి ఎంతో సహనం ఉంటుంది. ఆ సహనం నశిస్తే ఆదిపరాశక్తిని చూస్తాం. అదే పాయింట్ తో దర్శకుడు రాజేష్ 'కావేరి' కథను తెరకెక్కించడం ప్రశంసనీయం.ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అలాగే హీరో ఫైజల్, హీరోయిన్ రిషిత చక్కగా నటించారు. వారికి మంచి భవిష్యత్ ఉందన్నారు.

 

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News