Janhvi Kapoor: ‘దేవర’మూవీతో జాన్వీ కపూర్ ఆశలు ఫలించేనా.. !


Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ‘దేవర’ మూవీతో  సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకం అనే చెప్పాలి. 

1 /7

జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేసింది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా విజయం కోసం ఎదురు చూస్తుంది జాన్వీ.

2 /7

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది. అయినా ఇప్పటికీ కథానాయికగా  సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి.  అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది.  

3 /7

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టబోతుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా  జాన్వీ ఫ్యాన్స్  చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఈ నెల  27న విడుదల కాబోతుంది. ఈ సినిమా విజయం అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకం అని చెప్పాలి.   

4 /7

మొత్తంగా తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో  పాటు రామ్ చరణ్‌ తో RC 16 మూవీలతో టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో జెండా పాతాలని చూస్తుంది జాన్వీ. 

5 /7

  ఫస్ట్ సినిమా 'ధడక్‌' చిత్రంతో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు ఎక్కువగా ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.  

6 /7

  జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.  

7 /7

జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో  పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రంలో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.