బాబోయ్ బంగారం ;  రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితి నెలకొంటోంది

Last Updated : Aug 29, 2019, 06:35 PM IST
బాబోయ్ బంగారం ;  రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావంతో రోజు రోజుకు పడిడి ధర అమాంతంగా పెరిగిపోతోంది. పసిడి పేరు వింటే బెంబేలెత్తె పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం  బంగరం ధర ఢల్లీ ముంబై లాంటి నగరాల్లో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 40 వేల మార్క్ ను దాటింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నైలలో 40 వేల మార్క్ కు చేరువులో ఉంది ఈ రోజు గ్రాముపై రూ.250 వరకు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

దేశంలోని  బులియన్‌ మార్కెట్లో మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 40,210 పలుకుతోంది. ముంబైలో 4,021 గా ఉంది.  చెన్నై నగరంలో 3,8720 ఉండగా..హైదరాబాద్ లో 39,360, విజయవాడలో రూ. 39, 85 0 పలుకుతోంది. ఇక  వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. నేడు రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 49,050కి చేరింది. 

ఆర్థిక మాంద్యం భయాలతో పాటు అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, రూపాయి క్షీణత తదితర అంశాల బంగారం ధరలపై ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. దీనికితోడు పండగ సీజన్‌ కావడంతో నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు

Trending News