Gold Rate Today: పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?

Today Gold Rate:  బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,900గా ఉంది.
 

1 /5

బంగారం ధరలు వరుసగా ఈ వారం అంతా పెరుగుతూ వచ్చాయి. గడచిన మూడు రోజులుగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ నేడు బంగారం ధర  భారీగా పెరిగింది. ఇది ఇలా ఉంటే బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి గత మార్చి నెలలో రూ.75600 వద్ద నమోదు అయ్యింది. ఈ రికార్డును అధిగమించాలంటే బంగారం మరో 500 రూపాయలు పెరిగితే సరిపోతుంది.   

2 /5

ఆ తర్వాత బంగారం కొత్త రికార్డు స్థాయిని తాకుతుంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లో పసిడి ధరలు పెరగడమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో బంగారం ధర ఒక ఔన్సు 2670 డాలర్లుగా ఉంది. అమెరికాలో బంగారం ధర గత వారం రోజుల్లో వంద డాలర్లు పెరిగింది. ఈ ధర పెరుగుదల వెనుక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు  తగ్గించడమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

3 /5

దీనికి తోడు బంగారం ధర పెరగడానికి మరో కారణం  చైనా ఎడాపెడా బంగారం కొనుగోలు చేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. చైనా సెంట్రల్ బ్యాంక్ తన బంగారం నిల్వలు పెంచుకునేందుకు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం కొనుగోలు చేస్తుంది దీంతో పసిడి ధరలు జరిగేందుకు దోహదం అవుతున్నాయి. ఇక దేశీయంగా చూస్తే బంగారం ధరలు పెరగడానికి రాబోయే ఫెస్టివల్ కూడా ఒక కారణం అవుతుంది.   

4 /5

దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా  పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసేందుకు  పసిడి ప్రియులు సిద్ధమవుతూ ఉంటారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర త్వరలోనే  80 వేల రూపాయలు తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    

5 /5

ఇది ఇలా ఉంటే పెరుగుతున్న బంగారం నేపథ్యంలో  మీరు ఆభరణాల షాపింగ్ కు వెళ్తున్నట్లయితే, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రస్తుతం పేరు బంగారం ధర పెరిగిన నేపథ్యంలో ఒక గ్రాము తేడా వచ్చిన సుమారు 7500 రూపాయల వరకు మీరు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే బంగారం బరువు  విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. హాల్ మార్క్ బంగారాన్ని కొనుగోలు చేయాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ బంగారం మాత్రమే విక్రయించాలని ఆభరణాల తయారీదారులను  ఆదేశించింది.