Rashmika Mandanna: రష్మిక బ్లౌజ్ చూశారా.. అమ్మాయిల కోసం బెస్ట్ డిజైనర్ ఐడియా..

Rashmika Mandanna Hot Photos ; తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో స్టార్ స్టేటస్ ను అందుకున్న రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ హీరో నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె,  ఆ తర్వాత ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

1 /5

ముఖ్యంగా గీతగోవిందం సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఈ సినిమా అందించిన విజయం ఏకంగా మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది. అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో  మహేష్ బాబు సరసన నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు బాగా తలుపుతట్టాయి. అందులో భాగం గానే వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది రష్మిక. 

2 /5

తమిళ్, కన్నడ, తెలుగు అంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈమె ఇటీవలే బాలీవుడ్లోకి కూడా వెళ్లిపోయింది. రణబీర్ కపూర్ తో ఈమె చేసిన యానిమల్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప  సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 

3 /5

మరొకవైపు రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ బోహో లెహంగా ధరించి యువతను మెస్మరైజ్ చేసింది. వింటేజ్ లుక్కులో యువతను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.  

4 /5

తాజాగా ఇండియన్ ఐడల్ లో కనిపించిన ఈమె ఇలా బ్లాక్ కలర్ లెహంగాపై గోల్డెన్ కలర్ ఫ్లవర్ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. దీనికి మ్యాచింగ్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చోలీనీ జత చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీటికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ జువెలరీతో మ్యాచ్ చేసింది.   

5 /5

ఇక బ్యాక్ లైస్ డిజైనర్ బ్లౌజ్ ద్వారా ఎథ్నిక్  స్టైల్ కి ప్రత్యేకమైన హంగులు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఈ డ్రెస్ లో రష్మిక చాలా అందంగా అద్భుతంగా మెరిసిపోతుంది. ఈమె  లుక్కు చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మొత్తానికి అయితే తన అంద చందాలతో గ్లామర్ లుక్కుతో యువతను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రష్మిక.